Advertisement
తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వచ్చింది అంటే అప్పట్లో జనాలు ఎగబడి మరీ చూసేవారు.. అలాంటి వారి కాంబినేషన్ లో చిన్న తేడా వచ్చింది. ఒక సినిమాలో ఏఎన్నార్ తో ఆ పాత్రలో అయితే నేను నటించనని ఎన్టీఆర్ తెగేసి చెప్పారట.. మరి ఆ పాత్ర ఏమిటి ఆయన ఎందుకు అలా అన్నారో మనం ఇప్పుడు చూద్దాం..
Advertisement
ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇద్దరూ ఆ కాలంలో పోటాపోటీగా సినిమాల్లో నటించేవారు.. కానీ ఎన్టీఆర్ మాత్రం రాజకీయాలతో మరింత పేరును సంపాదించుకున్నారు.. అలాంటి ఎన్టీఆర్ మరియు ఏఎన్ఆర్ సినిమాలో కలిసి నటించినప్పుడు ఎప్పుడైనా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కంటే పెద్ద పాత్రలు చేసేవారు. అంటే ఏఎన్ఆర్ తమ్ముడుగా ఉంటే ఎన్టీఆర్ అన్నగా ఉండేవారు..
also read:లలిత జ్యువెలరీ అసలు ఓనర్ కిరణ్ కుమార్ కాదంట !
Advertisement
అయితే డైరెక్టర్ పుల్లయ్య దర్శకత్వంలో 1955 లో అర్ధాంగి అనే సినిమాను తీయాలనుకున్నారు. ఈ కథకు అనుగుణంగా ఇద్దరు హీరోలు అవసరం. ఇద్దరు అన్నదమ్ములుగా నటించాలి కానీ సవతి తల్లి కొడుకులు. ఈ సినిమాలో పిచ్చివాడి పాత్రకు అక్కినేని నాగేశ్వరరావును, విచ్చలవిడిగా తిరిగే తమ్ముడు యొక్క పాత్రకు ఎన్టీఆర్ ను తీసుకుందామని పి.పుల్లయ్య అనుకున్నారట. ఎన్టీఆర్ కు కథ మొత్తం వివరించారు. ఈ కథ విన్నాక ఎన్టీఆర్ కాస్త ఆలోచనలో పడ్డారు. అప్పుడే హీరోగా ఎదుగుతున్న సమయం. ఇంతలో హీరో మరియు విలన్ గా ఉండే పాత్రలో నటిస్తే తన సినీ కెరీర్ కు దెబ్బ పడుతుందని అనుకున్నారో ఏమో కానీ, కథ చాలా బాగుంది కానీ నేను తమ్ముడు వేషం వేయలేను అన్నాడు.
మీకు అభ్యంతరం లేకపోతే అన్న పాత్ర నాకు ఇవ్వండని అడిగాడు. దీనికి దర్శకుడు ఒప్పుకోలేదు. ఎందుకంటే పిచ్చివాడిగా ఎన్టీఆర్ ను ప్రేక్షకులు చూడలేరని ఈ పాత్రలో అక్కినేని చేస్తేనే చాలా చక్కగా ఉంటుందని పుల్లయ్య అభిప్రాయం. అలా మార్చి అన్న పాత్రను ఎన్టీఆర్ కు ఇవ్వలేనని చెప్పేశారు. ఇక ఎన్టీఆర్ ని కాకుండా తమ్ముడి పాత్రలో జగ్గయ్యను తీసుకున్నారట. చివరికి ఎన్టీఆర్ మీ నిర్ణయం బాగుంది, సినిమా బాగా వస్తుందని అన్నారట. ఈ సినిమాలో కథానాయిక పాత్రలో సావిత్రి జీవించేసారు. అసలు కథంతా ఆమెదే అనడంలో అతిశయోక్తి లేదు. అలా ఎన్టీఆర్ కి అన్న పాత్రలో అక్కినేని చేసే ఛాన్స్ మిస్ అయింది అన్న మాట. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది.