Advertisement
టాలీవుడ్ ఇండస్ట్రీ లెజెండ్స్ ఎవరు అన్న మాటకు వస్తే మొదటగా వినిపించే పేర్లు ఎన్టీఆర్, ఏఎన్నార్ లు. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా కూడా ఉండేవారట. వీరిద్దరూ చాలా సినిమాలనే పోటాపోటీగా చేసుకుంటూ వచ్చారు. అలాగే.. ఇద్దరు కలిసి కూడా సినిమాల్లో నటించారు. ఏ ఇద్దరు కలిసి నటించనన్ని సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. అప్పట్లో చాలా మంది నటులు స్టార్ లుగా గుర్తించబడ్డారు. కానీ ఎంత మంది వచ్చినా.. వీరిద్దరికి ఉన్న ప్రత్యేకత మాత్రం వేరేగా ఉండేది.
Advertisement

ANR and NTR Photos
వీరిద్దరూ ఎలాంటి పాత్రల్లో నటించడానికి అయినా వెనుకాడేవారు కాదు. వీరికి వీరే పోటీ అన్నట్లు ఉండేవారు. అయితే.. వీరిద్దరి మధ్య కూడా ఓ సారి దూరం వచ్చిందట. కొన్నేళ్ల పాటు ఇద్దరూ ఒకరినొకరు మాట్లాడుకోలేదట. ఈ విషయం గురించి సీనియర్ రచయిత కృష్ణ కుమారి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. ఓ సారి కృష్ణ కుమారి ఏఎన్నార్ వద్ద ఉన్న సమయంలోనే ఎన్టీఆర్ నుంచి ఏఎన్నార్ కు ఫోన్ వచ్చిందట. ఈ ఫోన్ మాట్లాడిన ఏఎన్నార్ చాలా భావోద్వేగానికి గురయ్యారట. ఫోన్ చేసిన వెంటనే ఎన్టీఆర్ ఓసారి మిమ్మల్ని కలవాలని ఉంది బ్రదర్, మీతో మనసులో మాటలు చెప్పుకోవాలని ఉంది అని చెప్పుకొచ్చారట. అయితే.. ఈ మధ్యే కదా మనం కలిసింది అని ఏఎన్నార్ అడుగగా.. అయినా సరే కలవాలని ఉందని ఎన్టీఆర్ పట్టుపట్టారట.
Advertisement

ANR and NTR Movies
అయితే.. ఏఎన్నార్ అలాగే కలుద్దాం బ్రదర్ అని చెప్పి కొంత సేపు మాట్లాడి పెట్టేసారుట. ఆ తరువాత ఏఎన్నార్ చాలా ఎమోషనల్ అయ్యారట. ఈ విషయాన్ని తన భార్యతో కూడా పంచుకున్నారట. కానీ ఎన్టీఆర్ నుంచి ఈ ఫోన్ వచ్చిన మరుసటి రోజే.. ఎన్టీఆర్ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ మాటలే ఎన్టీఆర్ ఏఎన్నార్ చివరగా మాట్లాడినవి. వీటిని చూస్తే.. ఈ ఇద్దరి మధ్యా ఎంత ప్రత్యేక అనుబంధం ఉందొ తెలుస్తుంది.
Read More:
సలార్ సినిమాలో ప్రశాంత్ నీల్ చేసిన మూడు బ్లెండర్ మిస్టేక్స్ ఇవే..!
ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ టాలీవుడ్ హీరోలకు, వారి భార్యలకు మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
సలార్ పార్ట్ 2 టైటిల్ విన్నారా..? ఎంత పవర్ఫుల్ గా వుందో… స్టోరీ ఏమిటంటే..?



