Advertisement
నేషనల్ ఆర్ట్ థియేటర్స్ తీపి జ్ఞాపకంగా తన నిర్మాణ సంస్థకు పేరు పెట్టుకున్నారు. ఎన్టీఆర్ దాని నుంచి నిర్మించిన మొదటి రెండు చిత్రాలు ‘పిచ్చి పుల్లయ్య’, ‘తోడు దొంగలు’ పరాజయాన్ని పొందాయి. ఆ అనుభవాలు నేర్పిన పాఠాలతో నందమూరి సోదరులు జీవితమంతా జాగ్రత్త పడ్డారు. అలా ఈ ఇద్దరు సోదరుల నిర్మాణంలో వచ్చిన అద్భుత చిత్రం ‘కోడలు దిద్దిన కాపురం’.
Advertisement
ఈ సినిమాలో వాణిశ్రీ, ఎన్టీఆర్ తో జంటగా నటించింది. ఈ చిత్రంలోని పాటలన్నీ సూపర్ హిట్ అయ్యి జనం నాలుకల మీద నానుతూ ఉన్నాయి. సావిత్రి ఈ సినిమాలో ఎన్టీఆర్ కు వదినగా నటించడం విశేషం. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ కోడలు దిద్దిన కాపురంలో సత్యనారాయణ వేసిన పాత్ర పుట్టపర్తి సాయిబాబాను పోలి ఉంటుంది. ఆ పాత్ర కాస్త నెగిటివ్ గా ఉండటంతో వివాదం నెలకొంది.
Advertisement
దీనితో సాయిబాబా భక్తులు దీనిపై కోర్టుకి కూడా వెళ్లడానికి సిద్ధమయ్యారు. కోర్టులో కేసు కూడా ఫైల్ అయింది. మరి తర్వాత ఏమైందో గానీ సినిమా విడుదల ఆగలేదు. ఆ పాత్ర సినిమాలో నుంచి తొలగించలేదు. దీని వెనుక ఏం జరిగిందో సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. కోడలు దిద్దిన కాపురం ఎన్టీఆర్ 200 వ సినిమా అని చెప్పిన ఆయన, సాయిబాబా భక్తులు వచ్చిన సమాధానం చెప్పగలనని సీనియర్ ఎన్టీఆర్ చెప్పినట్టు ఆయన తెలిపారు. ఆ సినిమాలో పాత్ర పకీర్ ను చూసి డిజైన్ చేసినట్టు కోర్టుకి ఎన్టీఆర్ చెప్పారట. పుట్టపర్తి సాయిబాబాను ఎన్టీఆర్ సీఎం అయిన తర్వాత కూడా కలవలేదట.
read also : Yashoda Movie Review : ‘యశోద’ మూవీ రివ్యూ..సమంత హిట్టు కొట్టిందా !