Advertisement
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు బెస్ట్ ఫ్రెండ్స్ గా కొనసాగుతున్నారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రభాస్, గోపీచంద్. వీరి తర్వాత ఎన్టీఆర్ అల్లు అర్జున్. వీరి స్నేహం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ ఎన్టీఆర్ ఒకరినొకరు బావ అనుకుంటూ ఆప్యాయంగా పిలుచుకుంటారు. కేవలం వీరిద్దరి మధ్య రిలేషన్ ఉండడమే కాదు.. వీరి ఫ్యామిలీల మధ్య కూడా మంచి ఫ్రెండ్ షిప్ ఉంది.
Advertisement
Advertisement
తాజాగా రాఖీ పండుగ సందర్భంగా ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి మరీ రాఖీ కట్టిందని సమాచారం. అయితే ఈ విషయం అధికారికంగా ఎక్కడ బయటకు రాలేదు. కానీ సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది. అయితే అల్లు అర్జున్ కు లక్ష్మీ ప్రణతి రాఖీ కడితే ఆయన గిఫ్ట్ కూడా భారీగానే ఇచ్చినట్టు తెలుస్తోంది.
అల్లు అర్జున్ లక్ష్మీ ప్రణతికి కోటి రూపాయల విలువ చేసే డైమండ్ వాచ్ ను బహుమతిగా అందించారని సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీంతో ఎన్టీఆర్ అల్లు అర్జున్ అభిమానులంతా సంబరపడిపోతున్నారు.