Advertisement
ప్రస్తుతం ఐపీఎల్ ఫివర్ నడుస్తోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దీని గురించే వినబడుతోంది. అయితే పోయిన ఏడాది ఐపీఎల్ లో సెన్సేషనల్ బ్యాటింగ్ స్టార్ బ్యాటర్ గా పరుగుల వరద పారించాడు సూర్య కుమార్ యాదవ్. అంతర్జాతీయ మ్యాచ్ లో, ఐపీఎల్ లో కూడా ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. మైదానంలో అడుగు పెడితే చాలు నలువైపులా షాట్లు కొడుతూ ‘మిస్టర్ 360’గా ప్రశంసలు అందుకున్నాడు.
Advertisement
also read: తల్లిదండ్రులు అలర్ట్.. పిల్లలకి చాక్లెట్ కొనిస్తున్నారా.. ఈ మ్యాటర్ తెలుసుకోవాల్సిందే..?
పొట్టి ఫార్మాట్లో నెంబర్ వన్ బ్యాటర్ గా ఐసీసీ నుంచి గుర్తింపు పొందాడు. ఇంతటి ఘనత కలిగిన సూర్య కుమార్ యాదవ్ ఈ ఏడాది దారుణంగా విఫలమవు తున్నారు. వరుస డకవుట్లతో చెత్త రికార్డు క్రియేట్ చేసుకుంటున్నాడు. వన్డే T20 ఐపిఎల్ ఇలా అన్ని ఫార్మాట్లలో దారుణంగా విఫలమవుతున్నాడు ఈ స్టార్ ప్లేయర్. ఈ తరుణంలో అతగాడిని జట్టు నుంచి తీసేయాలని కూడా వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంలోనే సూర్యకుమార్ కు ఊరటనిచ్చే న్యూస్ బయటకు వచ్చింది.
Advertisement
also read:అతగాడు గాఢంగా ప్రేమించాడు..ఆమె నిర్మానుష ప్రదేశానికి వెళ్దామని చెప్పింది.. బట్టలిప్పి..!!
తాజాగా ఐసీసీ విడుదల చేసిన టి20 ర్యాంకింగ్స్ లో మరోసారి “మిస్టర్ 360” ప్లేయర్ గా అగ్రస్థానం దక్కింది. బ్యాటింగ్ విభాగంలో మొత్తం 906 రేటింగ్ పాయింట్స్ తో తన మొదటి ర్యాంక్ ను కాపాడుకున్నాడు. ఈయన తర్వాత పాక్ వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ 811 పాయింట్లు, పాకు కెప్టెన్ బాబర్ అజాం 755 పాయింట్లు, ఇక ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 15వ స్థానంలో ఉన్నారు. మిగతా టీమ్ ఇండియా బ్యాటర్లు ఎవరు టాప్ 20 లో కూడా చోటు దక్కించుకోలేకపోయారు.
also read: స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గినట్టేనా?