Advertisement
ఈరోజుల్లో చాలామంది మనస్తాపానికి గురై ఆత్మ$$ ఏ అందుకు సమాధానం అని అనుకుంటున్నారు. తాజాగా ఒక సంఘటన యానంలో జరిగింది. వివరాలకు వెళితే ప్రేమించిన వ్యక్తి ఆత్మ$$ చేసుకోవడంతో, తీవ్రమనస్థాపానికి గురై యువత కూడా ప్రాణాలను తీసుకుంది. యానంలో యూకేవీ నగర్ కి చెందిన మౌనిక కి ఒక అక్క, ఒక చెల్లి ఉన్నారు. వీళ్ళ తల్లిదండ్రులు పదేళ్ల క్రితమే చనిపోయారు.
Advertisement
మౌనిక తాళ్లరేవు మండలం చొల్లంగి లోని నర్సింగ్ మూడవ సంవత్సరం చదువుతోంది. అక్క, చెల్లెలకి పెళ్లి అయిపోయింది. అత్తవారింట్లోనే ఉంటున్నారు. మౌనిక బాధ్యతల్ని మేనమామ చూసుకుంటున్నారు. మౌనిక రెండేళ్లుగా గురుస్వామి పేటకు చెందిన చిన్నా ని ప్రేమిస్తోంది. అయితే అతను గంజాయి కి బానిస అయిపోయాడు.
Advertisement
రెండు నెలల క్రితం 500 రూపాయలు అడిగితే తన అన్నయ్య ఇవ్వకపోవడంతో ఒంటికి నిప్పంటించుకుని తీవ్రంగా గాయపడి కాకినాడ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అప్పటినుండి కూడా మౌనిక కాలేజీ మానేసింది. చిన్న కి ఇలా అవ్వడం తో మౌనిక మానసికంగా కృంగిపోయింది. ఇక సోమవారం ఇంట్లో ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆమె ప్రాణాన్ని తీసుకుంది. మేనమామ పోలీసులకి కంప్లైంట్ చేయగా మృతదేహానికి ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకి ఆమెని అప్పగించారు.
Also read: