Advertisement
వెంకటేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ చిత్రాలలో నువ్వు నాకు నచ్చావ్ సినిమా ఒకటి. కె.విజయభాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దివంగత నటి ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా ప్రకాష్ రాజ్, చంద్రమోహన్, సుహాసిని, సునీల్ కీలక పాత్రలను పోషించారు. శ్రీ స్రవంతి మూవీస్ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డి.సురేష్ బాబు, శ్రీ స్రవంతి, రవి కిషోర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ రచయితగా పనిచేశారు. అయితే ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు నాకు నచ్చావ్ సినిమాను చూస్తున్నారు. కానీ అందులో జరిగిన పొరపాటును ఇప్పటివరకు ఎవరూ గమనించలేదు.
Advertisement
Advertisement
ఈ సినిమాలో వెంకీ వాళ్ళ నాన్న స్నేహితుడు ఇంటికి వస్తాడు. వాళ్ళ ఇంట్లోనే ఉంటున్న వెంకీకి ఆయన తండ్రి ఉత్తరం రాయగా, హీరోయిన్ ఆమె చెల్లెలు వెంకి దగ్గరకు వెళతారు. అప్పుడు తన పేరు పింకీ అని తను లిటిల్ ఫ్లవర్స్ కాన్వెంట్ లో 9వ తరగతి చదువుతున్నానని పరిచయం చేసుకుంటుంది. ఇక పింకీ స్కూల్ కి వెళ్లే సమయంలో చిన్న గొడవ జరుగుతుంది. అప్పుడు వెంకీ వచ్చి రౌడీల భరతం పట్టి స్కూల్ బస్సులో పింకీని ఎక్కించి పంపిస్తాడు.
అయితే స్కూల్ బస్ మీద పేరు బి.వి.బి.పి స్కూల్ అని ఉండగా, పింకీ చెప్పిన స్కూల్ పేరుకి దీనికి అసలు మ్యాచ్ కాలేదు. షాట్ కట్ లో రాసారేమో అనుకుంటే అక్కడ ఉన్న లెటర్స్ కూడా పేరుకు మ్యాచ్ అయ్యేలా లేవు. ఇలాంటి తప్పులు ఇందులో చాలానే ఉన్నాయి. వాటిల్లో ఇదొకటి. అయితే చాలా సినిమాలలో మనం ఈ తప్పులను గమనిస్తూనే ఉంటాం. కానీ పెద్దగా పట్టించుకోరు. సినిమా నచ్చాలే గాని ఇలాంటి తప్పులను ప్రేక్షకులు కూడా చూసి చూడనట్లు వదిలేస్తారు. సినిమాను ఎంజాయ్ చేస్తారు.
READ ALSO : “బాహుబలి” సినిమాలో బల్లాల దేవుని ముఖంపై ఈ గీత గమనించారా ? మీకు ఇదే డౌట్ వచ్చిందా ?