Advertisement
కేరళ రాష్ట్రంలో వయనాడ్ ప్రాంతంలో వరదలు సంభవించిన విషయం తెలిసిందే. అయితే ఆ ఘటనలో చూరాల్ మల గ్రామానికి చెందిన శృతి తన కుటుంబంలోని తొమ్మిది మంది సభ్యుల్ని ఒకేసారి కోల్పోయింది. కుటుంబ సభ్యుల్ని కోల్పోవడంతో ఆమె ఎంతగానో రోధించింది. చివరికి ఈ విషయంపై పినరై విజయన్ స్పందించారు. బాధిత యువతికి అండగా ఉంటారని హామీ ఇచ్చారు. ఇప్పుడిప్పుడే ఆమె జీవితంలోకి ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో విధి ఆమెపై మరోసారి పగబట్టింది.
Advertisement
జీవితాంతం తోడునీడగా ఉంటాడు అనుకున్న వ్యక్తి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఆమె కుటుంబ సభ్యుల్ని ప్రేమించిన వాడిని కోల్పోవడంతో గుండెలు పగిలేలా రోదిస్తోంది. కొంతకాలంగా శృతి జెన్సర్ తో ప్రేమలో ఉంది. వీరి మతాలు వేరైనాపటికి కుటుంబ సభ్యులు ప్రేమని అర్థం చేసుకుని ఒప్పుకున్నారు. జూన్ 30న వయనాడ్ ప్రాంతంలో సంభవించిన వరదలు శృతి జీవితాన్ని సర్వనాశనం చేసేసాయి. ఎవరూ లేకుండా చేసేసాయి.
Advertisement
Also read:
అయితే తోడుగా ఉంటాడన్న జెన్సర్ కూడా ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆమె రోధిస్తోంది. సెప్టెంబర్ లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటామని ప్రకటించారు. ఈ లోగానే శ్రుతి జీవితంలో ఈ దారుణం చోటుచేసుకుంది. కోజికోడ్ కొల్లెగల్ జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సు అతన్ని ఢీకొంది. ఈ ఘటనలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స తీసుకుంటున్న జెన్సర్ బుధవారం రాత్రి చనిపోయాడు. శృతి జీవితం మరింత తలకిందులుగా మారిపోయింది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి