Advertisement
ప్రపంచంలో ప్రమాదకరమైన జీవులలో పాములు కూడా ఒకటి. దాదాపుగా ఇవి అన్నిచోట్ల కనిపిస్తుంటాయి. ఎక్కువగా అడవుల్లో జీవిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో ఇండ్లలో కూడా కనిపిస్తాయి. అయితే పాముల్లో కొన్ని విషపూరితమైనవి ఉంటే.. మరి కొన్ని వాటిల్లో విషం ఉండదు. అంతేకాకుండా వాటితో మనుషులకు ప్రమాదం ఉన్నప్పటికీ వాటిని చూస్తేనే భయపడిపోతారు. పాముల్లో కొన్ని విషపూరితం ఉండడంతో అవి కాటు వేయగానే కొద్ది నిమిషాల్లో వ్యక్తులు చనిపోతారు. మరికొందరు వాటిని చూసి భయపడకుండా సులువుగా పట్టేస్తారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వ్యక్తి పామును పడుతున్న వీడియో వైరల్ అవుతుంది. అది చూశారంటే మీకు గూస్ బంప్స్ రావడం ఖాయం.
Advertisement
Advertisement
ఈ వీడియోలో ఓ వ్యక్తి గోడ లోపలికి వెళ్లిన పామును బయటకి తీసి రక్షిస్తాడు. పామును పట్టే కర్రతో మెల్లగా ఇటుకలను కదిలిస్తూ.. కొద్దికొద్దిగా మట్టిని తీస్తుంటాడు. అయితే పాము తోక బయట కనబడగానే వెంటనే పట్టుకుంటాడు. దాని తర్వాత స్నేక్ క్యాచర్ నెమ్మదిగా పామును ఇటుక దిమ్మెల నుండి బయటకు తీసి ఒక బాక్స్ లో లాక్ చేశాడు. ఇలా పామును పట్టడంతో అది ఎవరికీ హాని కలిగించకుండా అయిపోతుంది.ఈ గూస్ బంప్స్ వీడియోను సోషల్ మీడియాలో పాము నవీన్ అనే ID తో షేర్ చేశారు. దీనిని ఇప్పటివరకు నాలుగు మిలియన్ కంటే ఎక్కువసార్లు చూశారు. లక్ష మందికి పైగా ప్రజలు వీడియోను లైక్ చేశారు. అంతే కాకుండా పలు రకాల కామెంట్స్ చేశారు. కొంతమంది నెట్టిజన్లు రక్షించిన పామును ప్రమాదకరమైన నాగుపాముగా అభివర్ణిస్తున్నారు. మరికొందరు భయం లేకుండా త్వరగా పామును పట్టుకొని పెట్టెలో బంధించిన వ్యక్తి యొక్క ధైర్యాన్ని కొనియాడుతున్నారు. మరికొందరు ఈ రెస్క్యూ పిల్లిని పట్టుకోవడం లాంటిది అని కామెంట్ చేశారు.