Advertisement
టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ గురించి దాదాపు అందరికీ పరిచయమే. అతడినీ మిస్టర్ 360 అంటుంటారు. సిక్సులు కొట్టడంలో చాలా దిట్ట. టీ-20లలో మంచి సక్సెస్ సాధించిన సూర్యకుమార్ యాదవ్ వన్డేల్లో మాత్రం అంతగా రాణించడం లేదు. వన్డేల్లో వరుసగా విఫలం చెందుతున్నప్పటికీ టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కి హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అండగా నిలిచాడు. వన్డే ప్రపంచ కప్ 2023 జట్టులో ఈ టీ20 స్టార్ స్థానానికి వచ్చిన ఢోకా ఏం లేదు. సూర్యకు మేనేజ్ మెంట్ మద్దతు ఉంటుందని చెప్పుకొచ్చాడు ద్రవిడ్.
Advertisement
ఐవి కూడా చదవండి: పెట్రోల్ కోసం ₹30 అడగడం నుంచి..₹4 లక్షలను విరాళంగా ఇవ్వడం వరకు మొహమ్మద్ సిరాజ్ ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసారో తెలుసా?
ఐవి కూడా చదవండి: TOP 10 Richest Indian Cricketers: టాప్ 10 ధనిక క్రికెటర్లు.. మరియు వారి నెట్ వర్త్స్ ఎంతో చూడండి!
Advertisement
అక్టోబర్ 05 నుంచి భారత్ వేదికగా ప్రారంభం కానున్న ఐసీసీ ఈవెంట్ కి బీసీసీఐ 15 మంది సభ్యుల జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో సూర్యకుమార్ యాదవ్ కి చోటు దక్కింది. కేరళ వికెట్ కీపర్ సంజూ శాంసన్ ని కాదని సూర్యకుమార్ ని సెలెక్ట్ చేయడం పట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి. మరోవైపు సంజూ శాంసన్ కంటే సూర్యకుమార్ నిలకడగా రాణిస్తే అద్భుతాలు సృష్టిస్తాడనే నమ్మకంతోనే ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల ఆసియా కప్ లో ఆడిన ఒకే ఒక్క మ్యాచ్ లో సూర్య విఫలం చెందాడు. కానీ ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్ మాత్రం సూర్య హాప్ సెంచరీ సాధించాడు.
ఐవి కూడా చదవండి: క్రికెట్ ఫీల్డ్ లో ABS HURT కు అర్ధం ఏమిటి? పాకిస్థాన్ ఎందుకు ఓటమిని ఒప్పుకుంది?
సెప్టెంబర్ 28 వరకు జట్టులో మార్పులు చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో మిస్టర్ 360 ప్లేయర్ కి ఉద్వాసన పలికి మరొకరికీ అవకాశం ఇస్తే.. బాగుంటుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సూర్య కుమార్ గురించి దిగులు పడాల్సిన అవసరం లేదని.. వరల్డ్ కప్ అతని ప్రతిభ చూడాలనే మేము ఎంపిక చేశాం. మా నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. టీ 20 క్రికెట్ లో అతని సత్తా ఏంటో అందరికీ తెలుసు. అతని నైపుణ్యాలు, సామర్థ్యంపై నమ్మకం ఉందని చెప్పుకొచ్చాడు. వన్డేలో ఆరోస్థానంలో బ్యాటింగ్ చేయగలడు. ఒంటి చేత్తో మలుపు తిప్పగల సత్తా ఉన్నావాడు. అందుకే సూర్యకుమార్ కి ఎల్లప్పుడు మా సహకారం ఉంటుందని చెప్పుకొచ్చాడు రాహుల్ ద్రవిడ్.