Advertisement
మనదేశంలో హిందూ శాస్త్రం ప్రకారం హిందువులు రకరకాల సంప్రదాయాలను, ఆచారాలను అనుసరిస్తున్న విషయం తెలిసిందే. అందులో ముఖ్యంగా ప్రతి ఇంటికి వాస్తు అనేది ఎంత ముఖ్యమో తెలిసిన సంగతే. ఒక మనిషి జీవితంలో ఏం ఉన్నా లేకపోయినా ఓ ఇల్లు ఉంటే చాలు. సామాన్య తరగతి ప్రజలు కూడా ఇలాగే ఆలోచిస్తారు. అలాగే ఇంటికి వాస్తు అనేది కూడా చాలా ముఖ్యం. ఇప్పటివరకు స్థలానికి వాస్తు ఎలా ఉండాలో తెలుసుకున్నాం. ఇంటి నిర్మాణం కోసం ఎలాంటి స్థలాన్ని ఎంపిక చేసుకోవాలి, ఇంటి ప్రాంగణంలో ఎలాంటి చెట్లు ఉంటే మంచిది, వీధి పోట్లు, ఇంటి ప్రవేశ ద్వారం, ఆలయ సమీపంలో ఇల్లు కట్టవచ్చా తదితర విషయాలు తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి మారేటప్పుడు ఎలాంటి వస్తువులు మాత్రమే తీసుకెళ్లాలో తెలుసుకుందాం..
Advertisement
Read also: హిట్ సినిమాలలో మంచి పాత్రలు మిస్ చేసుకున్న 10 మంది నటీమణులు వీళ్లే!
1) తులసి మొక్క.
ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి మారుతున్నప్పుడు ముందుగా చూచుకోవాల్సింది తిధి, వారం, నక్షత్రాలు. ఇవి చూసుకున్న తర్వాత పాత ఇంటి నుంచి కొత్త ఇంటికి మొదట తీసుకు వెళ్ళవలసింది ప్రకృతి స్వరూపమైన తులసి మొక్కని తీసుకువెళ్లాలి.
2) రోలు, రోకలి.
Advertisement
రోలు, రోకలి, తిరగలి ఈ మూడు మానవ జీవితంలో ముడిపడి ఉన్నవి. బలరాముడు నాగలిని, రోకలిని ఆయుధాలుగా ధరించాడు. నాగలితో భూమిని దున్ని పంటను పండించి, ఆ పంటను రోకలితో దంచి భుజించండి అని చెప్పిన బలరాముడు నిజమైన రైతుకు ప్రతినిధి. రోలు లక్ష్మీదేవి, రోకలి నారాయణుడు, తిరుగలి శివుడు, దాని పిడి పార్వతి. ఇట్లు ఆయా అధిష్టాన దేవతలను పూజించి ధన, ధాన్య సమృద్ధి కలగాలని ప్రార్ధించడం రోలు, రోకలి తిరగలిని పూజించడంలోని అంతరార్థము.
3) ఆవు.
గృహప్రవేశం జరిగే రోజు ముందుగా పూజలు నిర్వహించి ఇంటిలోనికి గోవుని తీసుకువెళ్తారు. తర్వాత ఆ ఇంటి యాజమాని, ఇతర కుటుంబ సభ్యులు ఇంటిలోనికి ప్రవేశిస్తారు. హిందూ ఆచారం ప్రకారం గోవును సకల దేవతా స్వరూపం అని భావిస్తారు. అందువల్ల ముందుగా గోవు ద్వారా గృహప్రవేశం చేస్తే సకల దేవతలు మన ఇంటిలోనికి ప్రవేశిస్తారని భావిస్తారు. అలాగే సత్యనారాయణ స్వామి అలంకారణతో కూడిన ఫోటోని, అలాగే కులదైవం, లేదా ఇష్ట దైవం ఫోటోని తీసుకుని ఇంట్లోకి అడుగుపెట్టాలి.
Read also: మగధీర మూవీలో ఈ సీన్ చూసినప్పుడు మీకు ఇదే డౌట్ వచ్చిందా..?