Advertisement
మా అధ్యక్షుడు మంచు విష్ణు ఇటీవల విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)లో సభ్యత్వం ఉన్న వారికే ఇండస్ట్రీ లో నటించే అవకాశం ఇవ్వాలని.. ఈ విషయమై నిర్మాతలతో మాట్లాడతామని అన్నారు.విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికై ఏడాది గడిచినా సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఒక రకమైన వాదన వినిపిస్తోంది. మంచు విష్ణు కథానాయకుడిగా తెరకెక్కిన జిన్నా ఈ నెల 21న విడుదల కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే.
Advertisement
also read: మునుగోడు లో టిఆర్ఎస్ కు కొత్త పరేషాన్, కారును పోలిన 8 గుర్తులు
Advertisement
అయితే కొంత మంది నెటిజన్లు మీ సినిమాలో నటించిన అందరూ మా సభ్యులు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇందులో సన్నీలియోన్ కీలక పాత్ర లో నటించారు. ఆమె కూడా మా మెంబరేనా అని అడిగారు..ఈ ప్రశ్నలపై మంచు విష్ణు ఏం సమాధానం చెబుతాడో చూడాలి.. అందరూ మా సభ్యత్వం తీసుకోవాలని, సభ్యత్వం తీసుకోకుండా ఎక్కడినుంచో వచ్చి తెలుగు నిర్మాతల డబ్బులు తీసుకొని వెళ్ళి పోతుంటే చూస్తూ ఊరుకుంటామా.. అంటూ మంచు విష్ణు గట్టిగానే అన్నారు.. ఈ విషయంపై ఎవరైనా నిర్మాతలు సరిగ్గా రెస్పాండ్ కాకపోతే మాత్రం మా నుండి సహాయనిరాకరణ చేస్తామని అన్నారు.. ఇలాంటి పరిస్థితి రాదు అని కూడా చెప్పారు.
ఇదంతా పక్కన పెడితే తన తాజా సినిమా జిన్నాలో నటించిన నటులంతా మా సభ్యులేనా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఈ నిర్ణయానికి ముందు తీసిన సినిమా కాబట్టి జిన్నా మూవీకి ఈ సభ్యత్వం రూల్ వర్తించదు అనుకుంటే.. ఆ తర్వాత విష్ణు చేసే సినిమాల్లో కచ్చితంగా ఈ రూల్ పాటిస్తారు అని అనుకోవాలి.. ఎందుకంటే విష్ణు ఏదైనా అన్నాడు అంటే దాన్ని కచ్చితంగా చేసి తీరుతాడు.. మరి దీనిపై ఇండస్ట్రీ లో ఎంతమంది స్పందిస్తారో.. ఎంత మంది హీరోలు ఫాలో అవుతారు అనేది ముందు ముందు తెలుస్తుంది.
also read: