Advertisement
రహదారులపై మనం ప్రయాణించేటప్పుడు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. వాటి పక్కన ఉండే చెట్లను చూస్తుంటే మనసుకు ఎంతో ఆహ్లాదం కలుగుతుంది. అందుకనే చాలామంది ప్రయాణాలను చేయడాన్ని ఇష్టపడుతుంటారు. అయితే రహదారుల పక్కన ఉండే చెట్లకు చాలాచోట్ల కింది భాగంలో తెలుపు… దాని మీద పై భాగంలో కొద్దిగా ఎరుపు రంగు పెయింట్ లను వేస్తారు. చూశారు కదా. ఇలా ఎందుకు వేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
చెట్లకు ఇలా తెలుపు, ఎరుపు రంగు పెయింట్ వేశారంటే… అవి అటవీశాఖ పరిధిలోకి వస్తాయని అర్థం. అంటే వాటిని ఆ శాఖ అధికారులు ప్రత్యేకంగా రక్షిస్తారు అన్నమాట. అలాంటి చెట్లను చిన్న కొమ్మ నరికినా వారు చట్టపరంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటారు. అందుకనే అలా చెట్లకు పెయింట్ వేస్తారు. ఇక తెలుపు రంగు పెయింట్ ఏ ఎందుకంటే… రాత్రిపూట కూడా చెట్లు సులభంగా కనిపించాలని చెప్పి అలా తెలుపు రంగు పెయింట్ ను కింది భాగంలో వేస్తారు.
Advertisement
ఇక చెట్టు కింది భాగం నుంచి పైన కొంత భాగం వరకు మాత్రమే ఎందుకు పెయింట్ లను వేస్తారు అంటే… భూమిలోంచి కీటకాలు, పురుగులు చెట్టు ఎక్కి పాడు చేయకుండా ఉంటాయని చెట్టు కింది భాగం నుంచి మొదలు పెట్టి పైన కొంత భాగం వరకు పెయింట్ వేసి వదిలివేస్తారు. ఇలా పెయింట్ వేయడం వల్ల కీటకాలు, పురుగుల బారిన పడకుండా చెట్లు సురక్షితంగా ఉంటాయి. ఇక చెట్లకు ఇలా పెయింట్ వల్ల వాటి ఆయుర్దాయం పెరుగుతుందట. త్వరగా దెబ్బ తినకుండా ఉంటాయి. అందుకనే వాటికి ఇలా పెయింట్స్ వేస్తుంటారు.
Also read: