Advertisement
T20 World Cup 2022 : ప్రపంచ కప్ గ్రూప్ 2 లో ఆసక్తికరమైన మ్యాచ్ గురువారం జరగబోతోంది. దక్షిణాఫ్రికా తో జరిగే ఈ మ్యాచ్ లో గెలవకుంటే ఇంటిదారి పట్టాల్సిన సంక్లిష్ట పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది. ఒకవేళ సఫారీలు గెలిస్తే 7 పాయింటులతో ఆ జట్టుకు సెమీస్ బెర్తు ఖరార్ అవుతుంది. కాగా, టపార్డర్ బ్యాటర్ ఫకార్ జమాన్ గాయంతో ఈ టోర్నీకి దూరమయ్యాడు.
Advertisement
ఇక సిడ్ని మైదానంలో జరిగే ఈ మ్యాచ్ కు వరుణుడు ఆటంకం కల్పించకపోతే పరుగుల పండుగకు అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకోవచ్చు. ఇక్కడ జరిగిన గత రెండు మ్యాచ్ల్లోనూ టాస్ నెగ్గి బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. మ్యాచ్ అసాంతం ఆకాశం మేఘావృత్తమై ఉండవచ్చు. రెండో ఇన్నింగ్స్ సమయంలో గాలిలో తేమ 70% వరకు ఉండవచ్చని వాతావరణ శాఖ నివేదిక చెబుతోంది. ఈ టి20 వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు సౌత్ ఆఫ్రికా మాత్రమే ఒక్క మ్యాచ్ లోను ఓడిపోలేదు.
Advertisement
జింబాబ్వే మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో, ఆ మ్యాచ్ తర్వాత ఒక్క పాయింట్ దక్షిణాఫ్రికా ఖాతాలో చేరింది. ఆ తర్వాత బంగ్లాదేశ్, భారత్ లపై సౌత్ ఆఫ్రికా విజయాలు సాధించింది. మరోవైపు పాకిస్తాన్ ఇందుకు విరుద్ధమైన ఫలితాలను అందుకుంది. భారత్ తో మ్యాచ్ లో చివరి బంతికి ఓడిన పాక్, జింబాబ్వే పై ఒక పరుగు తేడాతో భంగపాటుకు గురైంది. దీంతో పాక్ జట్టుపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నెదర్లాండ్స్ పై గెలిచిన పాక్ ఎట్టకేలకు ఆసీస్ గడ్డమీద టి20లో బోనీ కొట్టింది. టి20 వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికా ఇప్పటివరకు పాక్ ను ఓడించలేదు. ఇది దాయాదికి కలిసివచ్చే అంశం. ఇరుదేశాలు ఇప్పటివరకు 21 టీ 20 మ్యాచ్ లో ముఖాముఖి తలపడగా, పాకిస్తాన్ 11 మ్యాచ్ లో విజయం సాధించింది. వరల్డ్ కప్ లో చివరిసారిగా 1999 లో పాకిస్తాన్ ను సౌత్ ఆఫ్రికా ఓడించింది. కాగా, స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ కు ప్రారంభం కానుంది.
read also : అర్ధరాత్రి అయ్యన్నపాత్రుడు అరెస్ట్, ఏకంగా ఆ కేసుల్లోనే!