Advertisement
ప్రపంచ కప్ 2023 లో పాకిస్తాన్ ఆడిన ఆటలన్నీ ఇప్పటివరకు నిరాశపరుస్తూనే ఉన్నాయి. నెదర్లాండ్స్, శ్రీలంకపై వరుస విజయాలతో టోర్నీని ప్రారంభించిన టీమిండియా భారత్, ఆస్ట్రేలియాల చేతిలో పాక్ ఘోర పరాభవాలను చవి చూసింది. ప్రస్తుతం పాయింట్ల ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్న పాకిస్థాన్ మళ్లీ విజయపథంలోకి రావాలని తహతహలాడుతోంది. అక్టోబర్ 23న పాకిస్తాన్ చెన్నైలో ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడుతోంది.ఈ మధ్య, పాకిస్తానీ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ ఇమామ్-ఉల్-హక్ ఓపెనర్ల నుండి పెద్ద హిట్స్ లేకపోవడం గురించి సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. సదరు ఓపెనర్ అసలు కారణం డైట్ అంటూ చెప్పుకొచ్చాడు.
Advertisement
ప్రపంచ కప్‌లో తమ ఇన్నింగ్స్‌లో మొదటి 10 ఓవర్లలో సిక్సర్ కొట్టని ఏకైక జట్టు పాకిస్తాన్. ఆట సమయంలో సిక్స్‌లు కొట్టాలంటే తాను మరియు అతని టీం మెంబెర్స్ తమ డైట్ లో ప్రోటీన్స్ ను చేర్చాలని చెప్పుకొచ్చాడు. ఇమామ్ ఉల్ హక్ మాట్లాడుతూ, “మేము కొన్ని సిక్సర్లు కొట్టడం ప్రారంభించాలంటే ప్రోటీన్ ను ఆహారంగా తీసుకోవాలని అన్నాడు. అన్ని మ్యాచ్ లను గమనించి చూస్తే అందరు ఎక్కువ స్కోర్ చేస్తున్నారని, కేవలం మా బౌలర్లు మాత్రమే కాదు.. ఇతర జట్ల బౌలర్లు కూడా ఇంతే గట్టిగా స్కోర్స్ ను ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇంకా తమ పేలవ ప్రదర్శనను సమర్ధించుకుంటూ మాట్లాడిన ఇమామ్.. ఇక్కడ మైదానాలు చిన్నవిగా ఉన్నాయని, వికెట్లు బాగున్నాయి.. బ్యాట్స్ మెన్స్ ను సెట్ చేసినప్పుడు బౌలర్లకు తక్కువ మార్జిన్ ఉంటోందని అన్నారు.
Advertisement
మేము సాకులు చెప్పడం లేదు.. కానీ పరిస్థితులు అలా ఉన్నాయని ఇమాం చెప్పుకొచ్చాడు. నిజానికి ఆస్ట్రేలియా లో మ్యాచ్ లో లాగా 420 లేదా 430 పరుగులు చేస్తారని నేను అనుకున్నానని.. కానీ, మా బౌలర్లు బాగా రాణించి వారి పరుగులను నియంత్రించగలిగారని అన్నారు. ఈ టోర్నమెంట్‌లో మాకు బ్యాక్-టు-బ్యాక్ మ్యాచ్‌లు ఉన్నాయి. మేము బాగా బౌలింగ్ చేస్తున్న రోజున – మేము మా స్కోర్స్ కి బ్యాక్ అప్ ఇస్తామని చెప్పుకొచ్చాడు. రెండు పెద్ద అవాంతరాలు ఎదురైనప్పటికీ, పాక్ జట్టులో సానుకూల దృక్పథం ఉందని, వారు కోలుకుంటారనే నమ్మకం ఉందని ఇమామ్ పేర్కొన్నారు. గత ఏడాది వన్డేల్లో తొలి 10 ఓవర్లలో పాక్ బ్యాట్స్‌మెన్ ఎందుకు సిక్సర్లు కొట్టలేదు అని ఓ విలేఖరి ప్రశ్నించగా.. మేము ఎక్కువ ప్రోటీన్ మరియు తక్కువ కార్బ్స్ తీసుకోవాలని చెప్పుకొచ్చారు.
మరిన్ని..
Today Current Affairs in Telugu 2023: 26 అక్టోబర్ 2023 రోజువారి కరెంట్ అఫైర్స్
బాలయ్యని మ్యాచ్ చేయలేకపోతున్న మెగాస్టార్.. ఈ లెక్క ఎక్కడ తప్పుతోందంటే?