Advertisement
పేలవ ఫామ్ తో వరుసగా విఫలమవుతున్న టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ మరోసారి అలాంటి ప్రదర్శనతో విమర్శల పాలవుతున్నాడు. న్యూజిలాండ్ తో టీ 20 సిరీస్ లో విఫలమైన పంత్, తాజాగా వన్డే సిరీస్ లో భాగంగా శుక్రవారం ముగిసిన తొలి వన్డేలో కూడా అదే ఆటను కొనసాగించాడు. ఇది ఇలా ఉండగా, మహేంద్ర సింగ్ ధోని, వికెట్ల మధ్యలోనే కాదు, వికెట్ల వెనకాల కూడా చిరుతల పరిగెడుతూ బ్యాట్స్ మెన్ లను పెవిలియన్ కు పంపిస్తుంటాడు.
Advertisement
ధోని అంత వేగంగా కదలడానికి అతడి ఫిట్నెస్ కారణం. జట్టులో అత్యంత చురుగ్గా ఉండాల్సింది కూడా వికెట్ కీపరే. మరి అలాంటి వికెట్ కీపర్ బద్ధకంగా ఉంటే, జట్టు భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు. ప్రస్తుతం టీమిండియా వికెట్ కీపర్ లుగా దినేష్ కార్తీక్, రిషబ్ పంతులు వ్యవహరిస్తున్నారు. అయితే దినేష్ కార్తీక్ మెరుపు కీపింగ్ చేస్తూ, డైవ్ లు చేయడం మనకు తెలిసిందే. ఇక వచ్చిన సమస్యల్లా రిషబ్ పంత్ ఒక్కడే. అతడు ఫిట్నెస్ చూస్తే అసలు ఇతడు ప్రొఫెషనల్ క్రికెటరేనా అని అనుమానం వస్తుంది. అలా ఉంటుంది అతడి బాడీ. అయితే ఒక వ్యక్తిగా బలమైన శరీరంల ఉండటంలో తప్పులేదు. కానీ క్రికెట్ లాంటి ఆటలోకి వచ్చేసరికి శరీరం దృఢంగా ఉండటం చాలా అవసరం.
Advertisement
అయితే బాడీ కొవ్వుతో నిండిపోయి స్థూలకాయలుగా మారితే, గ్రౌండ్ లో ఆయాసం వస్తుందే తప్ప రన్స్ రావు. అందుకే క్రీడాకారుల ఫిట్నెస్ పై అంతగా దృష్టి పెడతారు. పంత్ సైతం గతంలో ఫీట్నెస్ పై బాగానే దృష్టి పెట్టాడు. తన ఆహారపు అలవాట్లు మార్చుకొని బరువు కూడా తగ్గాడు. ఈ క్రమంలోనే ఇదే పద్ధతిని పంత్ కంటిన్యూ చేయడం లేదు. దాంతో మళ్లీ బరువు పెరిగాడు. ప్రస్తుతం పంత్ బొద్దుగా మారిన ఫోటో వైరల్ గా మారింది. దాంతో ధోనితో పోల్చుతూ, నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. పంత్ అసలుకే విఫలం అవుతూ, విమర్శల పాలవుతున్నావ్, ఇప్పటికైనా జర ఫిట్నెస్ పై దృష్టి పెట్టరాదు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ధోని 41 సంవత్సరాల వయసులో ఎలా ఉన్నాడు. 25 సంవత్సరాల వయసులో నువ్వెలా ఉన్నావ్ చూసుకో పంత్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి :
- 2001 కోల్కతా టెస్ట్ ఆస్ట్రేలియా తో గెలుపు లక్ష్మణ్, ద్రావిడ్ కాదు గంగూలీ ఎలాగంటే ?
- T20 World Cup 2022: జింబాబ్వేపై గెలుపు, సెమీస్‍లోకి భారత్ ఎంట్రీ.. ఆ జట్టుతోనే ఫైట్
- కోహ్లీ కెరీర్ నాశనం చేసేందుకు స్కెచ్ ?