Advertisement
సాధారణంగా చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటే వారికి చాక్లెట్ లాలీపాప్స్ కొనిస్తూ ఉంటారు తల్లిదండ్రులు. ఇలాంటివి ఇచ్చినప్పుడు పిల్లలు చాలా సైలెంట్ గా హ్యాపీగా తింటూ ఉంటారు. కానీ ఆ చాక్లెట్లు, లాలీపాప్స్ వారి ప్రాణాలు తీసేలా చేస్తున్నాయి. అవునండి మీరు విన్నది నిజమే.. వివరాలు తెలుసుకుందాం.. చాక్లెట్స్ లాలీపాప్స్ తయారీలో ప్రమాదకర రసాయనాలు కలుపుతూ పిల్లల అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నారు కొందరు నకిలీ చాక్లెట్స్ కేటుగాళ్లు. ఒకవేళ ఈ చాక్లెట్స్ కొనిచ్చామంటే పిల్లలు అనారోగ్యం బారిన పడినట్టే.
Advertisement
also read: స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గినట్టేనా?
మరి ఈ చాక్లెట్స్ ఎక్కడో తయారు కావడం లేదు మన హైదరాబాదులోనే తయారు చేస్తున్నారట. చాక్లెట్ తయారు చేస్తున్న దొంగ కంపెనీని రాజేంద్రనగర్ ఎస్ఓటి పోలీసులు గుర్తించారు. సిట్రిక్ యాసిడ్ పౌడర్, చక్కెర ఇతర కెమికల్స్ కలిపి వివిధ పేర్లతో నకిలీ చాక్లెట్ లాలీపాప్స్, పిప్పరమెంట్స్ వాటిని అందంగా ప్యాక్ చేసి బేగం బజారులోని హోల్సేల్ వ్యాపారాలకు విక్రయిస్తున్నారట. తక్కువ ధరతో పాటు అందంగా బ్రాండెడ్ కంపెనీల లేబుల్స్ వేసి ఉండడంతో అందరూ కొనేస్తున్నారు. వాటిని వేటితో తయారు చేస్తున్నారో ఎలాంటి పరిస్థితుల్లో తయారుచేస్తున్నారో తెలిస్తే మాత్రం షాక్ అవుతాం.
Advertisement
also read: బీఆర్ఎస్ పై మాజీ జేడీ ప్రేమ.. బీజేపీ ఆగ్రహం
ఓ షెడ్లో దోమలు, ఈగలు,పురుగులు పడిన పానకంతోనే తయారు చేస్తుండడం చూసి పోలీస్ అధికారులు భయపడిపోయారు. సులేమాన్ నగర్ లోని నకిలీ చాక్లెట్స్,లాలీపాప్స్ పరిశ్రమపై దాడి చేసి అహ్మద్ అనే వ్యక్తితో పాటు అక్కడ పనిచేస్తున్న కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. పెద్ద ఎత్తున చక్కెర రసాయనాలు,రంగు డబ్బాలు, డ్రమ్ముల్లోని ఇతర పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ చాక్లెట్లు ఎక్కువ మోతాదులో తినడం వల్ల పిల్లలకు క్యాన్సర్ ఇతర రోగాలు వస్తున్నట్లు అధికారులు తెలియజేస్తున్నారు.
also read: Dr. B.R Ambedkar Jayanthi 2023: Quotes, Wishes, Images, and Messages in Telugu, అంబేద్కర్ జయంతి