Advertisement
పారిస్ ఒలింపిక్స్ 2024 నాలుగో రోజుకి చేరుకుంది. భారత అభిమానులు అందరూ పది మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీం కాంస్య పతకం మ్యాచ్ పైనే ఉంది. సరబ్‌జోత్-మను బాకర్ జోడి దక్షిణకొరియా బృందంతో తలపడనుంది. భారత్ గెలిస్తే మరో కాంస్య పతకం వస్తుంది అంతేకాకుండా టాప్ షూటర్ పృద్విరాజ్ తొండై మాన్ ఫైనల్ కు అర్హత సాధిస్తే పతకం సాధించే అవకాశం ఉంటుంది. ఐర్లాండ్ మ్యాచ్లో భారత హాకీ జట్టు తిరిగి విజయాల బాట పట్టాలని అయితే చూస్తోంది. ముగ్గురు అగ్రశ్రేణి భారత బాక్సర్లు అమిత్ పంఘల్, జైస్మిన్ లంబోరియా, ప్రీతి పవార్‌లు సత్తా చాటాలని చూస్తున్నారు.
Advertisement
ఆర్చరీ గురించి చూస్తే.. మహిళల వ్యక్తిగత విభాగం అంకిత భకత్ (సాయంత్రం 5:14గంటలకు), భజన్ కౌర్ (సాయంత్రం 5:27గంటలకు) పురుషుల విభాగం ధీరజ్ బొమ్మదేవర (రాత్రి 10:46 గంటలకు). బ్యాడ్మింటన్ విషయానికి వస్తే.. పురుషుల డబుల్స్ (గ్రూప్ స్టేజ్) సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి -చిరాగ్ శెట్టి vs అల్ఫియాన్ ఫజార్ -ముహమ్మద్ రియాన్ అర్డియాంటో (ఇండోనేషియా) సాయంత్రం 5:30కు. మహిళల డబుల్స్ (గ్రూప్ స్టేజ్) అశ్విని పొన్నప్ప – తనీషా క్రాస్టో vs సెట్యానా మపాసా – ఏంజెలా యు (ఆస్ట్రేలియా) – సాయంత్రం 6:20 గంటలకు జరగనుంది. బాక్సింగ్ పురుషుల 51 కేజీల ప్రీక్వార్టర్స్ అమిత్ పంఘల్ vs పాట్రిక్ చినియెంబా (జాంబియా) – రాత్రి 7:16 గంటలకు. మహిళల 54 కేజీల రౌండ్ ఆఫ్ 16 ప్రీతి పవార్ vs యెని మార్సెలా అరియాస్ (కొలంబియా) – తెల్లవారుజామున 1:22 (జూలై 31). మహిళల 57 కేజీల రౌండ్ ఆఫ్ 32 జైస్మిన్ లంబోరియా vs నెస్తీ పెటెసియో (ఫిలిప్పీన్స్) రాత్రి 9:24 గంటలకు జరగనుంది.
Advertisement
Also read:
డ్రెస్సేజ్ ఇండివిజువల్ గ్రాండ్ ప్రిక్స్అ నూష్ అగర్వాలా మధ్యాహ్నం 2:30 గంటలకు. హాకీ విషయానికి వస్తే.. ఇండియా vs ఐర్లాండ్ – సాయంత్రం 4:45గంటలకు. రోయింగ్ పురుషుల సింగిల్స్ స్కల్స్ – క్వార్టర్-ఫైనల్స్ బాల్‌రాజ్ పన్వార్ – మధ్యాహ్నం 1:40 గంటలకు. షూటింగ్ పృథ్వీరాజ్ తొండైమాన్ – మధ్యాహ్నం 12:30 గంటలకు. ట్రాప్ మెన్స్ ఫైనల్ (అర్హతకు లోబడి) – సాయంత్రం 7 గంటలకు. ట్రాప్ మహిళల అర్హత : శ్రేయసి సింగ్ -రాజేశ్వరి కుమారి – మధ్యాహ్నం 12:30గంటలకు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ కాంస్య పతక మ్యాచ్ మను భాకర్ -సరబ్జోత్ సింగ్ vs దక్షిణ కొరియా మధ్యాహ్నం 1గంటకు.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!