Advertisement
అప్పుడప్పుడు రాజకీయ నాయకుల ఫోటోలు సోషల్ మీడియాలో కనబడుతుంటాయి. పార్లమెంట్ క్యాంటీన్ కి సంబంధించిన ఫోటోలు కూడా అప్పుడప్పుడు వాటిలో ఉంటూ ఉంటాయి. నూతన పార్లమెంట్ భవనం లో ప్రత్యేక సమావేశాలు మొదలయ్యాయి. ఇక మీదట ఇక్కడే పార్లమెంట్ కార్యకలాపాలని నిర్వహిస్తారు. పార్లమెంట్ గురించి మాట్లాడినప్పుడు మనకి క్యాంటీన్ గుర్తుకొస్తుంది. పార్లమెంట్ క్యాంటీన్లో చాలా చౌక ధరకే ఆహార పదార్థాలు లభిస్తాయి.
Advertisement
ఈ విషయం పై సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వార్తలు వస్తూ ఉంటాయి. పార్లమెంట్ క్యాంటీన్లో ఏ ఆహార పదార్థాలు దొరుకుతాయి..? వాటి ధర ఎంత అనే విషయాలని ఈరోజు మనం తెలుసుకుందాం. 2021 లో పార్లమెంట్ క్యాంటీన్ రేట్లు మార్పులు చేయడం జరిగింది ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ 2021 లో క్యాంటీన్ ధరల్ని మార్చింది.
Advertisement
దీంతో ఆహార పదార్థాల యొక్క రేట్లు కొంచెం పెరిగాయి. ఉదాహరణకు చపాతి రెండు రూపాయలు ఉంటే, దానిని మూడు రూపాయలకి పెంచారు. ఇలా కొంతమేర రేట్లలో మార్పులు చేశారు. చపాతీలలానే పలు రకాల ఆహార పదార్థాల రేట్లు కూడా పెరిగాయి.
మరి ఆ రేట్ల వివరాల కూడా చూద్దాం…. ఆలు బోండా రూ.10, చపాతీ రూ.3, పెరుగు రూ.10, దోస రూ.30, మటన్ బిర్యానీ రూ.150, లెమన్ రైస్ రూ.30, మటన్ కర్రీ రూ.125, ఆమ్లెట్ రూ.20, ఉప్మా రూ.25, సూప్ రూ. 25, సమోసా రూ.10, కచోరి రూ.15, పనీర్ పకోడా యాభై రూపాయలకి ఇక్కడ దొరుకుతాయి.
Also read: