Advertisement
ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో తన గురించి పార్టీని ప్రారంభించడానికి గల ఉద్దేశం గురించి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నాన్ని చేస్తున్నారు. మూవీస్ చేసుకునే హాయిగా ఉండే పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలను చూసి ఆ సమస్యలకు పరిష్కారం చూపించాలన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారని అంటున్నారు. రాజకీయాల్లోకి ఎన్నో విలువలతో వచ్చానని పవన్ కళ్యాణ్ అన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు తనని ఆదరించకపోయినా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేశానని అన్నారు.
Advertisement
తన క్యారెక్టర్ గురించి చెప్పిన పవన్ కళ్యాణ్ అందుకు ఒక చిన్న ఉదాహరణని ఇచ్చారు ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల కాలంలో స్టార్స్ అందరూ కమర్షియల్ యాడ్స్ పైన దృష్టి పెట్టే డబ్బులు సంపాదించుకుంటున్నారని పవన్ కళ్యాణ్ నేను మాత్రం ఏ సంస్థకు యాడ్ చేయట్లేదని అన్నారు. గతంలో తను కోకోకోలా కంపెనీకి యాడ్ చేశానని అదే తన మొదటి చివరి యాడ్ అని పవన్ కళ్యాణ్ చెప్పారు.
Advertisement
Also read:
Also read:
భార్య మంగళ సూత్రం అమ్మి పేకాట… అతనికి పవన్ చుక్కలు చూపించారు..!
కోకోకోలా వలన హెల్త్ సమస్యలు వస్తాయని తనకి తెలిసిన తర్వాత ప్రజలకి మంచిది కాదని నాకు డబ్బులు వచ్చినా సరే చేయలేదు అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆ యాడ్ చేస్తే తనకు షారుఖ్ ఖాన్ రెమ్యూనిరేషన్ కంటే ఎక్కువ ఇస్తామని అన్నారు. ఆ కంపెనీ వాళ్ళు మళ్ళీ మళ్ళీ యాడ్ చేయమని అడిగారట అయినప్పటికీ పవన్ కళ్యాణ్ నేను నమ్మకాలు వదిలేసి డబ్బులు కోసం యాడ్ చేసి ఉంటే బోలెడంత డబ్బు సంపాదించే వాడినని సిద్ధాంతాలకు కట్టుబడి పని చేసే వాడినని పవన్ కళ్యాణ్ ప్రజలకి అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశారు ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!