Advertisement
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇప్పుడు ఏకంగా డిప్యూటీ సీఎం అయ్యి ఎంతో మంచి పేరు తెచ్చుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కూడా ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఇప్పుడు రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తోంది ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ 4k వెర్షన్ లో వరల్డ్ వైల్డ్ గా రిలీజ్ చేశారు. హిందీలో హిట్ అయిన సల్మాన్ ఖాన్ దబాంగ్ ని తెలుగు నేటివిటీకి తగ్గట్టు హరీష్ శంకర్ మార్చారు. శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు. మే 11, 2012లో సమ్మర్ కానుకగా రిలీజ్ అయిన గబ్బర్ సింగ్ సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది.
Advertisement
30 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా ఆ రోజుల్లో 79 కోట్ల రూపాయలను వసూలు చేసింది 36 కేంద్రాల్లో 50 రోజులు 65 కేంద్రాల్లో 100 రోజులు ఆడి పవన్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసేలా చేసింది. నిజానికి మూవీ ని పవన్ కళ్యాణ్ ఇష్టపడి చేయలేదు. అన్నయ నాగబాబును అప్పుల నుంచి గట్టెక్కించడానికి చేశారు. ఆరెంజ్ మూవీ మిగిల్చిన నష్టాలతో పీకల్లోతో అప్పుల్లో కూలిపోయారు నాగబాబు. డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. అప్పుడు పవన్ కళ్యాణ్ 5 కోట్ల సహాయంతో పాటు తన నెక్స్ట్ సినిమాకు వచ్చే రెమ్యునరేషన్ మొత్తం ఇస్తానని మాట ఇచ్చారు. అలా గబ్బర్ సింగ్ చేశారు.
Advertisement
Also read:
పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ కి వచ్చిన లాభాలతో అన్నయ్య అప్పులను తీర్చి మిగితా అంతా నువ్వు తీసుకో రెమ్యూనరేషన్ సంగతి తర్వాత చూద్దామని అగ్రిమెంట్ సమయంలో బండ్ల గణేష్ తో పవన్ కళ్యాణ్ చెప్పారట. ఈ సినిమా బాగా వచ్చినప్పుడు ఏ హీరో అయినా స్వార్థంగాగా ఆలోచిస్తాడు కానీ పవన్ మాత్రం కష్టపడి కథను నువ్వు తెచ్చుకున్నావని గణేష్ తో అన్నారట. నీ ప్రాఫిట్స్ నుంచి ఏమీ తీయద్దు కానీ నాకు రెమ్యునరేషన్ ఇవ్వు. ఆ డబ్బుతో అన్నను సేవ్ చేస్తానని అన్నారట.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!