Advertisement
గద్దర్ చనిపోయిన విషయం తెలిసిందే. అయితే గద్దర్ చనిపోవడానికి వారం రోజులు ముందు తనకి ఒక మెసేజ్ పెట్టారని పవన్ గుర్తు చేశారు. ఇక అసలు ఏమైంది అనే విషయానికి వచ్చేస్తే గద్దర్ కి పవన్ కి మధ్య అనుబంధం ఎంతో బాగుండేది. పవన్ తనకి తమ్ముడిలాంటి వాడు అని గద్దర్ ఎన్నో సందర్భాల్లో చెప్పేవారు. ఆయన జేబులో నుండి డబ్బులు కూడా తీసుకునే అంత చనువు ఉందని ఆయన చెప్పేవారు. అయితే పవన్ మాత్రం ఎప్పుడూ గద్దర్ గురించి బయటకు చెప్పలేదు.
Advertisement
Advertisement
గద్దర్ మరణం తర్వాతనే ఆయనతో ఉన్న అనుబంధాన్ని చెప్తున్నారు. పవన్ వారాహి మూడో విడత యాత్రలో పవన్ తొలి రోజు గద్దర్ ని గుర్తు చేసుకున్నారు రాష్ట్రంలో 60 శాతం మంది యువతకు మార్గదర్శనం చేసి విజయం సాధించాలని ఆకాంక్షించాలని పవన్ అన్నారు. యువత కోసం, ఏపీ భవిత కోసం పోరాటానికి రెడీగా ఉన్నానని పవన్ వివరించారు. ఏపీ యువతని జగన్ దారుణంగా ముంచేసారని ఆయన చెప్పారు. ఇలా గద్దర్ అభిలాషిని గుర్తు చేస్తూ పవన్ యువతకు ఇచ్చిన పిలుపు ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
Also read: