Advertisement
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలతో ఇంకొక పక్క సినిమాలతో దూసుకు వెళ్ళిపోతున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది. సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ కలిసి బ్రో సినిమాలో నటించారు.
Advertisement
ఇదిలా ఉంటే ఏపీ మంత్రి అంబటి రాంబాబు వివాదం బ్రో సినిమాకి పెద్ద తలనొప్పి అయ్యింది. పవన్ కళ్యాణ్ వైసీపీని టార్గెట్ చేసినట్లుగా అనిపించాయని కూడా అన్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో పవన్ కళ్యాణ్ ప్రేక్షకులు ముందుకి రాబోతున్నాడు.
ఈ సినిమాలో కూడా పొలిటికల్ సెటైరికల్ పంచెస్ బాగానే రాయించినట్లు తెలుస్తోంది. హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ గతంలో గబ్బర్ సింగ్ సినిమా చేశారు. ఆ సినిమా అప్పట్లో ఒక ఊపు ఊపేసింది. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ కూడా చాలా బాగుంటుందని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
Advertisement
హరీష్ శంకర్ కి చెప్పి పవన్ కళ్యాణ్ పొలిటికల్ సెటైర్స్ ని రాయించినట్లు తెలుస్తోంది. 2024లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి పొలిటికల్ టచ్ ఉండేటట్టు చూసుకుంటున్నారని తెలుస్తోంది. అందుకే ఈ సినిమాని ఎన్నికల ముందు రిలీజ్ చేయొచ్చని టాక్. మరి ఈ సినిమాని ఎలా దర్శకుడు తీసుకు వస్తున్నాడు, ఎలా పొలిటికల్ టచ్ ని ఇవ్వబోతున్నాడు అనేది చూడాలి.
Also read: