Advertisement
పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకుబ్రేక్ ఇచ్చి రాజకీయాలతో ఫుల్ బిజీ అయిపోయారు. మొన్నటిదాకా సినిమాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఫుల్ ఫోకస్ అంతా రాజకీయాల వైపు షిఫ్ట్ చేసేసారు. ఈసారి ఎలాగైనా గెలవాలని జోరుగా ప్రచారాలని నిర్వహిస్తున్నారు. పవన్ తో సన్నిహితంగా ఉండే కొంతమంది వ్యక్తుల్లో శరత్ మరార్ కూడా ఒకరు. మల్టిపుల్ సినిమాలు నిర్మించారు. సర్దార్ గబ్బర్ సింగ్ గోపాల గోపాల వంటి సినిమాలు నిర్మించారు. పవన్ కు మంచి ఫ్రెండ్ కూడా.
Advertisement
పవన్ కళ్యాణ్ మనస్తత్వం ఏంటో ఆయనకి బాగా తెలుసు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నిర్మతలకు డేట్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని విమర్శ ఉంది. దీనిపై శరత్ స్పందిస్తూ పవన్ నిర్మాతల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు అవసరమైతే నష్టపోతాడు తప్ప ఎవరికీ నష్టాన్ని కలిగించడు. డబ్బు విషయంలో కూడా ఆయన ప్లానింగ్ తో ఉండరు. డబ్బు విషయంలో ముందు వెనక ఆలోచించమని పిల్లలు ఉన్నారు జాగ్రత్తగా ఉండమని నేను త్రివిక్రమ్ ఒకసారి సలహా ఇచ్చాము. తర్వాత తిట్లు తినాల్సి వచ్చిందని అన్నారు.
Advertisement
ఆయనకు డబ్బు మీద ఆశ లేదు ఆయన ఎప్పుడూ కూడా ఇటువంటి సలహాలు చెప్తే వినరు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి అని నేను త్రివిక్రమ్ చెప్పాము. ఆయన మాకు క్లాసు పీకారు అని అన్నారు. వాళ్లు లైఫ్ని లీడ్ చేయడానికి కావలసిన స్ట్రెంత్ ఇస్తాను అని పవన్ కళ్యాణ్ అన్నారట. పవన్ కళ్యాణ్ దగ్గర పనిచేసే వ్యక్తి తన మంగళ సూత్రం అమ్మేసి మరీ పేకాట ఆడాడు. అతని భార్య పవన్ కి వచ్చి చెప్పి బోరుమని ఏడ్చారట దీంతో పవన్ కళ్యాణ్ ఆమెకి ధైర్యం చెప్పి ఆర్థికంగా సహాయం చేశారట. అంతటితో ఆగకుండా అతన్ని పిలిపించారు. భయం రుచి ఏంటో అతనికి చూపించారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన వార్నింగ్ తో అతను మళ్లీ పేకాట జోలికి వెళ్ళలేదు అని శరత్ అన్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!