Advertisement
సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారధ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. గ్రామీణ అభివృద్ధికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. అయితే ఈ క్రమంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటిపారుతుల మంత్రిత్వ శాఖలను పర్యవేక్షిస్తున్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడుగు ముందుకు వేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో కూడా గ్రామ సభలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 1336 పంచాయతీలు ఉన్నాయి.
Advertisement
Advertisement
అన్నిట్లో ఒకే రోజు ఒకేసారి గ్రామ సభలను నిర్వహించేలా పవన్ కళ్యాణ్ చర్యలను తీసుకుంటున్నారు. ఈనెల 23వ తేదీన ఏర్పాటు చేయాలని ఇది వరకే అధికార యంత్రంగాన్ని ఆయన ఆదేశించారు. దీనికి సంబంధించిన పనులు ప్రస్తుతం పూర్తవుతున్నాయి. గ్రామసభల్లో చదవాల్సిన నోటీసులు కూడా సిద్ధం చేశారు. వచ్చే ఐదేళ్లలో గ్రామాల్లో 17,500 కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్లను వేయడం, 10000 కిలోమీటర్ల మేర మురుకు కాలవలను నిర్మించడం.. ప్రతి ఇంటికి మంచినీరు అందేలా చూడటం.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం జరిగేలా చూస్తున్నారు.
Also read:
అలాగే గ్రామాల్లో చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాలు అన్నిటిని కూడా అక్టోబర్ రెండవ తేదీన పున ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఆయా పనులను గ్రామసభల సందర్భంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టాల్సిన పనులు ఆమోదం వేతనాలను కోరే హక్కు అర్హతల గురించి ప్రజలకు వివరించబోతున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!