Advertisement
ఉమ్మడి ఏపీలో విభజన ఏపీలో ఎంతోమంది పంచాయతీరాజ్ శాఖకు మంత్రులుగా పనిచేశారు. అయితే ఈ శాఖకు తలపడిన వారి అనుభవం నిండిన వారు ఎందరో వచ్చారు ఎవరి శైలి వాళ్లది. అలాగే ఎవరి ఆలోచనలు కూడా వాళ్ళవి. పంచాయతీరాజ్ శాఖ నిజానికి చాలా కీలకమైనది. గ్రామీణ ప్రాంత దేశంలోనూ రాష్ట్రంలోనూ నూటికి 70% మందికి పనిచేసే శాఖ ఇది అని చెప్పొచ్చు. అయితే ఇందులో పవన్ కళ్యాణ్ ఏరి కోరి వచ్చారు. గత రెండు నెలలుగా ఆయన కేవలం తన శాఖ మీద ఫోకస్ పెట్టారు. శాఖా పరంగా ఆయన పూర్తిగా అధ్యయనం చేస్తున్నారు.
Advertisement
ఈ శాఖలో తన ముద్ర వేయాలని తపన పడుతున్నారు. అందుకని మిగిలిన వాటిని ఆయన పట్టించుకోవట్లేదు. కేవలం శాఖాపరమైన రివ్యూస్ ని నిర్వహిస్తున్నారు. ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖలో పవన్ కొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. గతంలో ఎవరు తీసుకొని నిర్ణయం ఇది. ఒకేసారి రికార్డ్ స్థాయిలో గ్రామసభలు వేలాదిగా నిర్వహించడం ఇది నిజంగా ఒక సంచలనంగా అంతా చూస్తున్నారు.
Advertisement
Also read:
దేశంలో కూడా ఎక్కడ ఇది జరగలేదు. ఏపీలో ఈ నెల 23న 1336 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించడం అనేది గొప్ప అచీవ్మెంట్. గ్రామాలలో ఉపాధి అవకాశాలు అందించే విధంగా ఈ గ్రామ సభలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పనులకు ఆమోదం తెలపడం అంటే పెద్ద ఎత్తున గ్రామాల్లో ఉపాధిని అందించడమే కాకుండా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!