Advertisement
రాజకీయాల్లో ఓ కొత్త మలుపు. ఎన్డీఏ సమావేశానికి జనసేనకు ఆహ్వానం వచ్చింది. అయితే ప్రత్యేక ఆహ్వానం వచ్చినట్టు తెలుస్తోంది. ఇది వరకు ఎన్డీఏలో పనిచేసిన పార్టీలు, భావసారుప్యత వుండే పార్టీలకి ఎన్డీఏ భేటీకి బీజేపీ ఆహ్వానాలు ని పంపిస్తోంది. అందుకే జనసేనకు కూడా ఇన్విటేషన్ వచ్చిందట. కానీ ఇది వరకు మిత్రుడు అయిన టీడీపీకి మాత్రం ఇంకా ఆహ్వానం రాలేదు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసివెళ్తాయని వార్తలు వస్తున్నాయి.
Advertisement
టీడీపీకి ఆహ్వానం కనుక అందలేదు అంటే ఏం అవుతుంది..? ఎలాంటి మార్పులు కనపడతాయనేది చూడాలి. వ్యతిరేక కూటమి సమావేశం కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని బెంగుళూరు లోని నిర్వహించనున్నారు. అయితే కాంగ్రెస్ ఆధ్వర్యం లో కలిసి పని చేసేందుకు 18 పార్టీలు ముందుకు రాగా… అధికార బీజేపీ కలవర పాటుకు గురైంది. సో ఈ మేరకు ఎన్డీఏ బలోపేతం పై ఫోకస్ పెట్టడం జరిగింది. అయితే ఏవేవో కారణాల వలన దూరమైన పార్టీలను దగ్గర చేర్చుకోవాలని చూస్తోంది.
Advertisement
ఈ కారణం గానే ఈ నెల 18న ఎన్డీఏ మిత్రపక్షాల భేటీని పెడుతున్నారు. జనసేన ని కూడా ఈ మేరకు ఆహ్వానించింది. టీఎంసీ, అన్నాడీఎంకే, శివసేన, ఎన్సీపీ చీలికవర్గాలు, అకాలీదళ్, ఎల్జేడీ వంటి పార్టీలకు కూడా ఇన్విటేషన్ వెళ్ళింది. తెలుగుదేశం కి మాత్రం రాలేదు. అయితే సమావేశానికి సమయం వుంది కనుక తప్పకుండా ఆహ్వానం వస్తుంది అని అంటున్నారు. ఎన్డీఏ కీలక భేటీకి చంద్రబాబుకు ఇంకా పిలుపు లేక పోవడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ కేవలం జనసేన తో కలిసి వెళ్దాం అని అనుకుంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తారో చూడాలి.
Also read: