Advertisement
తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ రాజమహేంద్ర వరం జైలు వద్ద చంద్రబాబు నాయుడుని కలిశారు. వారిద్దరి మధ్య కొన్ని మాటలు జరిగాయి. అనంతరం రెండు పార్టీల పొత్తు విషయమై కొంత చర్చ జరిగింది. వారి మీటింగ్ తరువాత బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ పొత్తు గురించి మీడియా ముందు మాట్లాడారు. ఇంతకీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ల మధ్య ఏమి చర్చ జరిగిందో చూద్దాం.
Advertisement
ములాఖత్ వద్ద చంద్రబాబుని చూసిన వెంటనే పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉంది అంటూ ప్రశ్నించారు. బాగానే ఉన్నా అంటూ చంద్రబాబు నాయుడు బదులిచ్చారు. ఆ తరువాత వారిద్దరి మధ్య చంద్రబాబు నాయుడి అణిచివేత వైఖరి గురించి చర్చ జరిగింది. ఈ చర్చల మధ్యలోనే టీడీపీ జనసేన పార్టీల పొత్తు గురించి కూడా చర్చ జరిగింది. అయితే.. పొత్తు గురించి పవన్ కళ్యాణ్ ప్రస్తావించగానే.. ఇంత హఠాత్తుగానా అంటూ చంద్రబాబు నాయుడు ఆశ్చర్యం వ్యక్తం చేసారు.
Advertisement
అయితే.. పవన్ ముందు కొంతకాలం తరువాత చెప్పాలి అని అనుకున్నప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ముందుగా చెప్దామని అనడంతో చంద్రబాబు నాయుడు ఆలోచనలో పడ్డారు. ఈ విషయం గురించి లోకేష్ ను ప్రశ్నించగా.. మీరు ఏది అంటే దానికి ఒకే అని లోకేష్, బాలయ్య బాబు కూడా తమ అంగీకారాన్ని తెలిపారట. దీనితో ఉమ్మడి కార్యాచరణ గురించి వారి మధ్య చర్చ జరిగింది. ఇక చంద్రబాబు నాయుడుపై ఉన్న కేసుల గురించి, వాటిపై లాయర్ల అభిప్రాయాల గురించి కూడా లోకేష్ పవన్ కు వివరించారు. ఈ చర్చల అనంతరం బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. జనసేన టీడీపీ పార్టీల పొత్తు గురించి చెప్పారు. ప్రస్తుతం ఎన్నికలు లేకపోవడంతో.. కేవలం ప్రకటన మాత్రమే చేసారు.