Advertisement
చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తరువాత పవన్ కళ్యాణ్ వేగంగా స్పందించిన సంగతి తెలిసిందే. అంతే కాదు.. చంద్రబాబు నాయుడుని కలిసి పొత్తు విషయం గురించి కూడా అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడే పొత్తు గురించి ప్రకటన చేసి.. అటు టీడీపీ బాధ్యతలు కూడా తీసుకున్నారు. ఇటీవలే వరుణ్ తేజ్ పెళ్లి కోసం ఇటలీ వెళ్లిన పవన్ కళ్యాణ్ తిరిగి వచ్చిన తరువాత చంద్రబాబు నాయుడుని కలిసి పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రణాళికకు సంబంధించి చర్చలు జరిగాయి. రెండు పార్టీలు కలిసి షణ్ముఖ వ్యూహంతో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
Advertisement
ఇటీవల ఢిల్లీ వెళ్ళినప్పుడు తెలంగాణాలో పొత్తు గురించి బీజేపీ నేతలతో జరిగిన చర్చల గురించి చంద్రబాబు నాయుడుకు వివరించారు. తెలంగాణలో పోటీ చేయకూడదు అని టీడీపీ అనుకోవడానికి గల నేపధ్యాన్ని, కారణాలను చంద్రబాబు పవన్ కు వివరించారు. ఈ సందర్భంగా తానూ జైలులో ఉన్న సమయంలో అండగా నిలబడినందుకు పవన్ కు చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. రెండు పార్టీలు కలిసి ఉమ్మడిగా చేయాల్సిన పనుల గురించి చర్చించుకోవడానికి ఈ నెల తొమ్మిదిన సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించాలని రెండు పార్టీల నేతలు అనుకున్నారు.
Advertisement
అయితే.. ఈ సమావేశానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లు హాజరు కావడం లేదు. కేవలం రెండు పార్టీల నేతలు మాత్రమే హాజరు అవుతారు. కరువు, అనావృష్టి అంశాలపై ఫోకస్ చేయాలనీ నిర్ణయించుకున్నారు. చంద్రబాబు నాయుడు పై ఉన్న కేసులు ఓ కొలిక్కి వచ్చాక రెండు పార్టీలు కలిసి విస్తృత సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఇరు పార్టీల అధినేతలు కలిసి చర్చలు జరపడంతో అటు టీడీపీ, ఇటు జనసేన వర్గాలు ఫుల్ జోష్ లో ఉన్నాయి.
Read More:
Maa Oori Polimera Director Dr. Anil Vishwanath Age, Biography, Movies, Family Details
Balakrishna Movies: బాలయ్యబాబు డబుల్ రోల్స్ ప్లే చేసిన సినిమాలు ఇవే.. లిస్ట్ ఓ లుక్ వేయండి..!
రన్ వీర్ సింగ్ కంటే ముందు దీపికా రిలేషన్ లో ఉన్న ఈ 7 మంది ఎవరో తెలుసా?