• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » AP politics » వైసీపీ నేతలకు ‘‘పవర్’’ పంచ్

వైసీపీ నేతలకు ‘‘పవర్’’ పంచ్

Published on December 9, 2022 by Idris

Advertisement

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. వైసీపీ నేతలు ఆయన్ను లైట్ తీసుకున్నట్లు పైకి చెబుతున్నా.. ఈసారి నష్టం తప్పదని రాజకీయ పండితులు విశ్లేషణ చేస్తున్నారు. సంక్షేమం పేరుతో ఓవైపు విచ్చలవిడిగా అప్పులు చేసి.. అదే అబివృద్ధి అనుకుంటే రానున్న రోజుల్లో తిప్పలు తప్పవనే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జగన్, చంద్రబాబు పాలనను చూసిన జనం కూడా పవన్ పాలన కూడా చూద్దామనే ఆలోచనలో ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు.

Advertisement

ఇటు పవన్ కూడా ఎన్నికలపై దృష్టి సారించారు. ప్రచార వాహనం వారాహి ని పరిచయం చేశారు. అయితే.. ఈ వెహికల్ హాట్ టాపిక్ గా మారింది. మిలటరీ ట్యాంక్‌ ను పోలి ఉన్న ఈ వాహనం విషయంలో అధికార వైసీపీ పవన్ ను టార్గెట్ చేస్తోంది. మంత్రి పేర్ని నాని దీనిపై మీడియాతో మాట్లాడుతూ.. లక్ష పుస్తకాలు చదివాను అంటారు కదా.. ఇండియన్ మోటార్ వెహికల్ యాక్ట్ కూడా చదివితే బాగుంటుందని పవన్ కు సూచించారు. ఈ చట్టం ప్రకారం ఆలీవ్ గ్రీన్ సొంత వాహనాలకు వేయకూడదని చెబుతోందన్నారు. ఆ రంగు ఉంటే వాహనం రిజిస్ట్రేషన్ కూడా అవదని తెలిపారు. వేరే రంగు వేసే బదులు ముందే వాహనానికి పసుపు రంగు వేసుకుంటే ఖర్చు కలిసి వస్తుంది కదా అంటూ సెటైర్లు వేశారు నాని.

నిజానికి ఇండియన్ మోటార్ వెహికల్ యాక్ట్‌లో కలర్స్ నిబంధనల్లో ఆలీవ్ గ్రీన్ రంగు మిలటరీ వాహనాలకు తప్ప.. ఏ ఇతర వాహనాలకూ ఉండకూడదన్న నిబంధన ఉంది. నిజంగానే మిలటరీ రంగు ఉన్న వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయరు. అలా తిప్పడాన్ని అంగీకరించరు. అలా ఉంటే కచ్చితంగా కలర్ మార్చాల్సిందే. అందుకే ఇప్పటి వరకూ మోటార్ కంపెనీలు ఏవీ ఆలీవ్ గ్రీన్ కలర్ వాహనాలను అమ్మలేదు. మిలటరీ వాహనాలకు మాత్రమే ఆ కలర్ ఉంటుంది. అయితే.. వారాహి వాహనం విషయంలో వైసీపీ చేస్తున్న రాద్ధాంతానికి తనదైన రీతిలో కౌంటర్ ఇచ్చారు పవన్.

Advertisement

ముందుగా ఆలివ్ గ్రీన్ చొక్కాని ట్వీట్ చేసిన పవన్.. ఇది వేసుకోవచ్చా అంటూ కౌంటర్ వేశారు. మరో ట్వీట్ లో తన సినిమాలను అడ్డకున్నారని.. ఆపై విశాఖ పర్యటనకు వెళ్తే హోటల్ గది నుంచి బయటకు రాకుండా చేశారని గుర్తు చేశారు. బలవంతంగా తనను విశాఖ నుంచి పంపించేందుకు చూశారని అన్నారు. మంగళగిరిలో సైతం తాను కారులో వెళ్తుంటే అడ్డుకున్నారని చెప్పారు. ఇప్పటం గ్రామానికి నడుచుకుంటూ వెళ్తుంటే ఆపేశారన్నారు. ఇప్పుడు వాహనం రంగు పైనా వివాదం చేస్తున్నారని.. ఇకపై శ్వాస తీసుకోవటం ఆపేయమంటారా అని పవన్ ఫైర్ అయ్యారు.

ఇటు జనసేన నేతలు కూడా దీనిపై స్పందించారు. ఆపార్టీ అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ మాట్లాడుతూ.. వారాహి వాహనాన్ని చూసినప్పటి నుండి వైసీపీ నేతలకు చలికాలంలో సెగ తగిలినట్టుగా ఉందన్నారు. ఓనర్ కి డ్రైవర్ కి తేడా తెలియని పేర్ని నానికి… ఆలివ్ గ్రీన్ కి, గెలాక్టిక్ గ్రీన్ కి, ఎమరాల్డ్ గ్రీన్ కి తేడా ఏం తెలుస్తుందిలే అంటూ సెటైర్లు వేశారు. జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ.. ప్రభుత్వ కార్యాయాలకు పార్టీ రంగులు వేసి హైకోర్టుతో మొట్టికాయలు తిన్నవారు కూడా జనసేన వాహనం రంగు గురించి మాట్లాడటం, నిబంధనల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. నిబంధనల ప్రకారమే వారాహి వాహనానికి రంగులు ఉంటాయన్న ఆయన.. ఏపీఎస్ఆర్టీసీని వైసీపీఆర్టీసీగా మార్చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పార్టీ కార్యక్రమాలకు ఆర్టీసీ బస్సుల్లో జనాన్ని తరలిస్తూ ప్రయాణికులను అవస్థల పాలు జేయడంపై మండిపడ్డారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ ప్రచార వాహనం రంగు కేంద్రంగా విమర్శలు ప్రతివిమర్శలతో రాజకీయంగా వేడి రాజుకుంది.

1st you have stopped my films; in Visakhapatnam U didn’t let me come out of the vehicle & hotel room & forced me to leave the city. In Mangalagiri U didn’t let my car go out,then didn’t let me walk & now the color of vehicle has become an issue.OK,shall I stop breathing?? Next..

— Pawan Kalyan (@PawanKalyan) December 9, 2022

Related posts:

మరోసారి జగన్ సీఎం కాకపోతే.. గెలిచినా రాజీనామా చేస్తా ! టీడీపీపై బీజేపీ స్కెచ్.. మామూలుగా లేదు..! కందుకూరు చుట్టూ ఏపీ రాజకీయం..! ఆర్కేతో చంద్రన్నకు తలనొప్పి.. స్వారీ చెబితేనే పొత్తు అంటున్న పవన్.. ఏమైందంటే..?

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd