Advertisement
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఓ పిరియాడిక్ ఫిక్షనల్ సినిమా “హరిహర వీరమల్లు” సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత ఏం రత్నం ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా అనంతరం పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ” భవదీయుడు భగత్ సింగ్ ” సినిమాకి సైన్ చేసిన విషయం కూడా తెలిసిందే. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ ఈ సినిమాని పక్కన పెట్టి.. తమిళ్ హీరో విజయ్ సూపర్ హిట్ సినిమా అయిన.. ” తేరి ” స్క్రిప్ట్ ని పవన్ కళ్యాణ్ కి తగ్గట్లుగా రీమేక్ పై వర్క్ చేయమని హరీష్ శంకర్ కి చెప్పినట్లుగా వార్తలు వినిపించాయి.
Advertisement
Read also: కులాంతర వివాహాలు చేసుకున్న మన టాలీవుడ్ హీరోలు !
Advertisement
అయితే పవన్ కళ్యాణ్ మళ్లీ రీమేక్ లో నటిస్తున్నారని విషయం తెలిసి ఆయన అభిమానులు తెగ ఫీల్ అవుతున్నారు. తేరి రీమేక్ వద్దంటూ ట్విటర్లో ఏకంగా 2 లక్షల ట్వీట్లతో ఈ మూవీ గురించి ట్రెండింగ్ అయింది. రీమేక్ ఆలోచన మానుకోవాలని హరీష్ శంకర్ కి సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్ అభిమానులు. ఈ క్రమంలో దివ్యశ్రీ అనే పవన్ కళ్యాణ్ మహిళా అభిమాని.. దర్శకుడు హరీష్ శంకర్, మైత్రి మూవీ మేకర్స్ కి రాసిన ఓ లేక సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ లేఖలో ఏముందంటే .. ” సర్ ఇంతవరకు ఒక లెటర్ కూడా రాయని నేను ఇలా లెటర్ రాయాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు.
మీరు ఎన్ని రీమేక్ సినిమాలు తీసిన నేను ఎప్పుడూ ఇంతగా ఫీల్ అవ్వలేదు. కానీ తేరీ రీమేక్ అని తెలిశాక రాయక తప్పలేదు. ఈ లెటర్ చూసిన తర్వాత అయినా ఈ సినిమాని క్యాన్సల్ చేస్తారని అనుకుంటున్నా. ఇప్పటికే ప్రతి ఆదివారం టైమింగ్స్ మార్చి తేరీ మూవీని టీవీల్లో ప్రసారం చేస్తున్నారు. ప్లీజ్ సార్.. ఈ ప్రాజెక్టుని క్యాన్సిల్ చేయండి. నా చావుకి కారణం మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు, దర్శకుడు హరీష్ శంకర్” అని లేఖ రాసి తనువు చాలించింది ఆ యువతి. ఈ లేఖపై మైత్రి నిర్మాతలు, హరీష్ శంకర్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
Read also: మన మహేష్ బాబు ‘ఒక్కడు’ మూవీని విజయ్ ఎలా చెడగొట్టాడో చూడండి!