Advertisement
ప్రస్తుతం ఏపీ రాజకీయాలు చాలా రసవత్తరంగా కొనసాగుతున్నారు. మొన్నటి వరకు టిడిపి వర్సెస్ వైసీపీ అన్నట్లుగా రాజకీయాలు నడవగా.. ఇప్పుడు జనసేన వర్సెస్ వైసీపీ పార్టీ మధ్య వార్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 27న మంగళగిరిలో పర్యటించనున్నారు. గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణలో ఇల్లు, దుకాణాలు కోల్పోయిన వారికి పార్టీ తరపున పరిహారం అందించనున్నారు.
Advertisement
ఈనెల 4వ తేదీన ఇప్పటం గ్రామంలో అధికారులు రహదారి విస్తరణ పేరిట ఇల్లు, ఇతర నిర్మాణాలను తొలగించిన సంగతి తెలిసిందే. అప్పట్లో దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ స్వయంగా ఇప్పటం గ్రామానికి వచ్చి బాధితులను పరామర్శించి, వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చినందునే ఇప్పటం గ్రామంలో ఇల్లు కూల్చివేసారని పవన్ ఆరోపించారు.
Advertisement
రోడ్డు విస్తరణలో ఇల్లు, దుకాణాలు కోల్పోయిన వారికి రూ. లక్ష చొప్పున పరిహారం ప్రకటించారు. ఆ పరిహారాన్ని అందించేందుకు పవన్ కళ్యాణ్ ఈనెల 27న రానున్నారు. అయితే ఈ పరిహారాన్ని పవనే స్వయంగా ఇప్పటం వెళ్లి అందించే అవకాశం ఉందని, వీలుకాని పక్షంలో బాధితులను మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి పిలిపించి అందించనున్నట్లు సమాచారం. పవన్ పరిహారం ప్రకటించిన తర్వాత తమకు అవేమీ వద్దని వైసీపీకి చెందిన కొందరు ఫ్లెక్సీలు కట్టారు. దీంతో పరిహారం ఎందరికి ఇవ్వాలనే విషయంలో స్పష్టత రాలేదు. బాధితుల నుంచి వివరాలు సేకరించి ఎవరైతే పరిహారం తీసుకునేందుకు అంగీకరిస్తారో వారికి ఇవ్వాలని జనసేన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంతమందికి అందించేది రెండు, మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇవి కూడా చదవండి : హోంగార్డు పదవికి మర్రి రాజీనామా ?