Advertisement
ఏపీ రాజకీయాలు చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఏపీలో మొన్నటి వరకు టిడిపి, జనసేన కలవబోతున్నాయి అంటూ వార్తలు వినిపించాయి. విజయవాడలో చంద్రబాబు వెళ్లి పవన్ ను కలవడం ఆ ఊహగానాలకు మరింత బలం చేకూర్చిందంటున్నారు. మొన్నటిదాకా బిజెపిని కూడా టిడిపి తో పొత్తుకు ఒప్పించాలని పవన్ ప్రయత్నించారనే వార్తలు కూడా వినిపించాయి. అయితే ప్రధాని మోడీతో పవన్ కళ్యాణ్ భేటీ తర్వాత టిడిపికి పవన్ దూరం ఎందుకు అయ్యారనేదానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Advertisement
టిడిపితో కలిసి వెళితే జనసేనకు వచ్చేది కేవలం కొన్ని సీట్లు మాత్రమే. ముఖ్యమంత్రి పదవి రాదు. సీఎం అయ్యేది చంద్రబాబే కాబట్టి పవన్ ముఖ్యమంత్రి కాలేరు. అదే బిజెపితో జనసేన కలిసి ఎన్నికలకు వెళితే పవన్ సీఎం అయ్యే ఛాన్స్ ఉంది. టిడిపి తో వెళితే పూర్తిగా నష్టపోతారు. ఇదే అంశాన్ని పవన్ కి మోడీ వివరించినట్టు బిజెపి, జనసేన వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, ప్రధాని మోదీ తో జనసేనాని భేటీ తర్వాత బిజెపి, జనసేన కూటమిగా ముందుకెళ్తే పవన్ సీఎం అభ్యర్థిగా బరిలో ఉంటారని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. పరోక్షంగా ప్రధాని భేటీలోనూ ఇవే సంకేతాలు ఇచ్చినట్లు పార్టీ నేతల సమాచారం.
Advertisement
బిజెపి, జనసేన కలిసి బలమైన కూటమిగా ఎదగటం ద్వారా, ఇతర పార్టీల నుంచి వలసలు కూడా పెరుగుతాయని బిజెపి నేతలు వివరించినట్లుగా తెలుస్తోంది. జనసేన మద్దతు లేకుండా టిడిపి ముందుకెళ్లే పరిస్థితి లేదనే అంచనాతో బిజెపి నేతలు ఉన్నారు. దీంతో, పవన్ కళ్యాణ్ మరోసారి టిడిపి తో జత కట్టకుండా చూసినట్లయితే, భవిష్యత్తులో తమ రెండు పార్టీలది కీలక పాత్ర అవుతుందని విశ్లేషిస్తున్నారు. ప్రధానితో భేటీ సమయంలోనూ, బీజేపీతో కలిసి, రెండు పార్టీలు బలోపేత దిశగా అడుగులు వేయాలనే సంకేతాలు పవనకు అందాయని చెబుతున్నారు. దీని కారణంగానే ఇప్పుడు టిడిపి వైపు జనసేనాని ఆలోచనలో మార్పు కనిపిస్తుందనేది పార్టీ నేతల విశ్లేషణ. ఇక పవన్ బిజెపికి దగ్గరై, సైకిల్ కు దూరమైతే టీడీపీ పరిస్థితి ఏంటి అనే చర్చ కూడా జోరుగా జరుగుతోందంటున్నారు.
Read also: యాంకర్ సుమక్క అసలు వయస్సు ఎంతో తెలుసా ?