Advertisement
సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచం. టాలెంట్ ని బట్టి ఇక్కడ టాప్ పొజిషన్ లో సెలెబ్రిటీలు ఉంటూ ఉంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీ లో మెగాస్టార్ తరువాత.. ఆయన స్థానాన్ని భర్తీ చేయడానికి చాలా మందే ఉన్నారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, తారక్.. ఇలా చెప్పుకుంటే స్టార్ హీరోలు చాలా మందే ఉన్నారు. అయితే.. ఒక్కోసారి వీరికి కూడా పరాజయాలు ఎదురు అవుతుండడం సహజమే. ఓ స్టార్ హీరో సినిమా సూపర్ సక్సెస్ అయితే ఏ స్థాయిలో కలెక్షన్స్ వస్తాయో.. ఒకవేళ ఫ్లాప్ అయినా కూడా అదే స్థాయిలో నష్టాలు వస్తూ ఉంటాయి.
Advertisement
పవన్ కళ్యాణ్ కు అజ్ఞాత వాసి, మహేష్ బాబుకు బ్రహ్మోత్సవం సినిమాలు పెద్ద డిజాస్టర్ రిజల్ట్ ను ఇచ్చాయి. ఈ సినిమాల వలన నిర్మాతలకు చాలా నష్టమే వచ్చింది. అజ్ఞాతవాసి సినిమాకు త్రివిక్రమ్ డైరెక్టర్ గా చేసిన సంగతి తెలిసిందే. అప్పటికే.. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబో హిట్ అవ్వడం.. వరుసగా రెండు సార్లు వీరి కాంబో సినిమా బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టడంతో ముచ్చటగా మూడో సారి రాబోతున్న అజ్ఞాతవాసి సినిమాపైన ఫాన్స్ చాలా ఆశలే పెట్టుకున్నారు.
Advertisement
కానీ, ఆ సినిమా అనుకోని రీతిలో డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమాకు వచ్చిన నష్టాల నుంచి కోలుకోవడానికి చాలా సమయమే పట్టింది అంటూ నిర్మాత నాగవంశీ ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పేర్కొన్నారు. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన “అరవింద సమేత” సినిమా హిట్ అయ్యిందని.. ఈ సినిమాతో వచ్చిన లాభాలతోనే “అజ్ఞాతవాసి” సినిమా నష్టాలను కవర్ చేయగలిగామని నాగవంశీ పేర్కొన్నారు.
మరిన్ని..
సిబిఎన్ ను జైల్లోనే ఉంచేసి.. రోడ్లపై ప్రచారం చేయనున్న వైసీపీ? ఎన్నికల వ్యూహం అదేనా?
సిబిఎన్ అరెస్ట్ తో ఈ లెక్కలన్నీ మారాయిగా.. జనాలు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారంటే?