Advertisement
2019 ఎన్నికల నుంచి బిజెపి పార్టీతో కలిసి ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్… తాజాగా తన మనసు మార్చుకున్నారు. బిజెపి నుంచి దూరంగా ఉండేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఇవాళ మంగళగిరి పార్టీ ఆఫీస్ లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలే… దీన్ని అద్దం పడుతున్నాయి. బీజేపీతో సంబంధాలపై పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ్టీ నుంచి రాష్ట్ర ముఖ చిత్రం మారుతోందని ఆగ్రహించారు.
Advertisement
జనసేన లాంటి పార్టీ బీజేపీని రోడ్ మ్యాప్ అడగమేంటని విమర్శలు వచ్చాయని…ఎందుకో బీజేపీతో పొత్తు ఉన్నా..పూర్తి స్థాయిలో కలిసి వెళ్లలేకపోతున్నామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. ఈ విషయం బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి తెలుసు అని పేర్కొన్నారు. ప్రధాని, బీజేపీ నాయకత్వం అంటే నాకు గౌరవమే.. అలాగని ఊడిగం చేయలేమని తేల్చి చెప్పారు. ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు కూడా నన్ను బహిరంగంగా తప్పుపట్టారని… లక్షల మంది జనసైనికులు ఉండగా నీకు బిజెపి రూట్ మ్యాప్ ఎందుకని ఆయన ప్రశ్నించారని గుర్తు చేశారు పవన్ కళ్యాణ్. అందుకే తాను కూడా మనసు మార్చుకున్నారని పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఏపీలో సంచలన మార్పులు ఉంటాయని కూడా అన్నారు.
Advertisement
మా భారతమ్మను తిట్టేస్తున్నారని వైసీపీ నేతలు తెగ బాధపడిపోతున్నారు….నా తల్లి అంజనమ్మని ఎలా విమర్శించార్రా..? అని ప్రశ్నించారు. ఇక ఆటో నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా పొత్తులపై స్పందించారు. 2024 ఎన్నికలలో జనసేన, తెలుగుదేశం పార్టీ మరియు బిజెపి పార్టీలు పొత్తు పెట్టుకుంటాయనేది ప్రచారం మాత్రమేనని… అందులో వాస్తవం ఏమాత్రం లేదని సోము వీర్రాజు కూడా కొట్టి పారేశారు. ఇక ఇవాళ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సైతం… బిజెపి మరియు జనసేన మధ్య ఉన్న దోస్తాన కటీఫ్ అయినట్టే తెలుస్తోంది. అంతేకాదు మంగళగిరి పార్టీ ఆఫీసులో మాట్లాడిన అనంతరం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ కావడం… దీనికి మరింత ఆయువు పోసినట్టు అయింది.
Read also : కేసీఆర్ పార్టీలో లుక లుకలు…టీఆర్‌ఎస్ నేతల ఆస్తులు జప్తు !