Advertisement
ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం టూర్. మొన్న విశాఖపట్నం కు పవన్ కళ్యాణ్ వెళ్ళగా… అప్పటినుంచి ఇవాల్టి వరకు విశాఖలో హై టెన్షన్ నెలకొంది. పవన్ కళ్యాణ్ ను హోటల్ నుంచి బయటకు రాకుండా ఏపీ పోలీసులు అష్టదిగ్బంధనం చేశారు. అయితే ఇవాళ విశాఖపట్నం వీడీ… పవన్ కళ్యాణ్ తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ నేపథ్యంలోనే మరోసారి ప్రెస్ మీట్ నిర్వహించారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం అలాగే 2024 ఎన్నికలపై సంచలన ప్రకటన చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
Advertisement
వైసిపి నుంచి ఏపీని విముక్తి చేయడమే తమ లక్ష్యమని జనసేన అధినేత పవన్ ప్రకటించారు. ‘వైసీపీ విముక్త ఏపీ కోసమే ఎన్నికల్లో పోరాటం చేస్తాం. వైసిపి విముక్త ఏపీ జరగకపోతే తెలంగాణ కూడా నష్టపోతుంది. వైసిపి తో తేల్చుకుంటాం. వైసిపిని గద్దె దించుతాం. ఆ దిశగా అడుగులు వేస్తాం. కులం, మతం, ప్రాంతం అని కొట్టుకుంటుంటే అభివృద్ధి ఎక్కడుంటుంది? దీని పై ప్రజలు కూడా ఆలోచించాలి’ అని పవన్ కోరారు.
Advertisement
ఉత్తరాంధ్ర పై వైసీపీ నేతలకు ప్రేమ ఉంటే సైనికులకు చెందిన 71 ఎకరాల భూములను ఎందుకు ఆక్రమిస్తారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ‘విశాఖలో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న దస్ పల్లా భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయి. వైసిపి నేతల భూ కబ్జాలు బయటపడతాయని జనవాణి కార్యక్రమం జరగనీయలేదు. అధికారమంతా ఒక కుటుంబం చేతిలో పెట్టుకుని వికేంద్రీకరణ గురించి మాట్లాడడం విడ్డూరం’ అని పవన్ ఎద్దేవా చేశారు.
విశాఖలో మంత్రుల కార్లపై రాళ్ల దాడి జరుగుతుంటే, భద్రతగా ఉండాల్సిన పోలీసులు ఏమైపోయారని పవన్ ప్రశ్నించారు. ‘రెచ్చగొడితే నేను రెచ్చిపోతానని చూశారు. కానీ నేను చాలా సంయమనంతో ఉన్నా. వైసీపీకి హింస కావాలి. కానీ మేము చేయము. అధికారానికి దూరంగా ఉన్నవాళ్లు గర్జించాలి. ప్రభుత్వంలో ఉండి గర్జనలు, కూతలు ఏంటి? వైసీపీ శ్రేణులు ఎన్ని దాడులు చేస్తున్న కేసులు ఉండవు. దీనిని DGP సమర్ధిస్తారా? అని పవన్ ప్రశ్నించారు.
READ ALSO : “ఈనాడు” రామోజీరావు ఓ సైకో..కొడుకు సుమన్ మరణం వెనుక ?