Advertisement
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియని వారు ఉండరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ ను ఒక దేవుడిలా భావిస్తారు వారి అభిమానులు. అంతటి పేరు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని వార్తల్లో నిలిచారు. అయినా ఆయన క్రేజ్ మాత్రం రోజురోజుకు పెరిగింది తప్ప ఏ మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తన జనసేన పార్టీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలని పట్టుదలతో ముందుకు పోతున్నారు. మరి అలాంటి పవన్ కళ్యాణ్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చే సమయంలో ఆమెకు చాలానే డబ్బు,ఆస్తులు ఇచ్చారని ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Advertisement
Advertisement
మరి ఆమెకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన భరణం ఎంత అనే వివరాలు చూద్దాం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ కంటే ముందుగా విశాఖపట్నానికి చెందిన నందిని అనే అమ్మాయిని వివాహమాడారు. సినిమాల్లోకి రాకముందే ఈ పెళ్లి జరిగింది. ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్ కు 10 లక్షలు ఖర్చుపెట్టి పెళ్లి చేశాడు చిరంజీవి. బద్రి సినిమా సమయంలో రేణుదేశాయ్ కి పవన్ కి మధ్య ప్రేమ పుట్టింది. ఈ క్రమంలోనే వారు కొన్నేళ్ళ పాటు సహజీవనం చేశారు. అయితే అప్పుడే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించడంతో, పవన్ కళ్యాణ్ గురించి కొన్ని విమర్శలు చిరంజీవికి ఎదురయ్యాయి. దీంతో పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందినికి విడాకులిచ్చి అనంతరం రేణుని పెళ్లి చేసుకున్నారు.
తర్వాత ఆమెకు ఇద్దరు సంతానం కలిగారు. వారే అఖిరా నందన్, ఆద్య. అయితే నందినికి విడాకులు ఇచ్చే సమయంలో పవన్ కళ్యాణ్ ఆమెకు 30 లక్షల రూపాయల భరణం కింద ఇచ్చారని తెలుస్తోంది. తర్వాత ఆమె వైజాగ్ కి చెందిన ఒక డాక్టర్ ని పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయింది. అయితే పవన్ కళ్యాణ్ ఆమెను ఎలాంటి కట్నం తీసుకోకుండనే వివాహం చేసుకున్నారట.తర్వాత పవన్ రేణును చేసుకున్నా కొన్ని రోజులకు ఆమెకు కూడా విడాకులు ఇచ్చారు. తర్వాత మూడవ భార్యగా అన్నా లెజ్నేవా తో రిలేషన్ లో ఉన్నారు.
also read: