Advertisement
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకు పండగే. ఈ మ్యాచ్ ఎప్పుడు జరిగినా, ప్రపంచ దేశాలు స్థైతం ఈ మ్యాచ్ ను చూస్తాయి. అటు క్రికెట్ బెట్టింగ్స్ కూడా జోరుగా సాగుతాయి. వాటితో పాటు రెండు జట్ల మధ్య మాటల యుద్ధం కూడా చాలా రసవత్తరంగానే ఉంటుంది. ఇక సమయం దొరికినప్పుడల్లా పాక్ మాజీ క్రికెటర్లు టీమిండియా పై విషం కక్కుతూనే ఉంటారు.
Advertisement
టి20 వరల్డ్ కప్ లో టీమిండియా సెమీఫైనల్ లో ఓడిన తర్వాత ఇది మరింత ఎక్కువ అయింది. మరి ముఖ్యంగా అక్తర్ మరియు రమీజ్ రాజాలు టీమిండియా పై విపరీతంగా దాడి చేస్తున్నారు. ఆ మాటలకు టీమిండియా ఆటగాళ్లు కూడా దీటైన సమాధానం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలపై పాక్ మాజీ బౌలర్ డ్యానిష్ కనేరియా సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ప్రపంచ కప్ ను పాకిస్తాన్ బైకాట్ చేస్తుందన్న వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ప్రపంచ క్రికెట్ బోర్డుల్లో అత్యంత ధనవంతమైన బోర్డుగా బీసీసీఐ ఉంది. దాంతో సహజంగానే ఐసిసి బోర్డు భారత్ కు అనుకూలంగా ఉంటుందని గుర్తు చేశారు.
Advertisement
అదీకాక ఐసీసీ నిర్వహిస్తున్న 2023 వరల్డ్ కప్ ను బై కాట్ చేసే దమ్ము గానీ ఉద్దేశం కానీ పాక్ కు లేదు. ఇక క్రికెట్ లో టీమిండియాను ఎదిరించే దమ్ము కూడా పాక్ కు లేదని కనేరియా ఈ సందర్భంగా పేర్కొన్నాడు. క్రికెట్ కు సంబంధించిన నిర్ణయాలు ఏ ఒక్కరు తీసుకునేవి కాదని, దానికి క్రికెట్ బోర్డు ఉంటుందని కనేరియా అన్నాడు. బోర్డు చీఫ్ గా ఉన్నంత మాత్రాన అతని నిర్ణయమే ఫైనల్ కాదని మండిపడ్డారు కనెరియా. ఐసీసీ లాంటి మెగా టొరెంట్ బైకార్ట్ చేసి, క్రికెట్ ప్రపంచం లో ఎలా ఆడగలరని రాజాను ప్రశ్నించాడు. బాయ్ కాట్ చేస్తామని మాట్లాడే ముందు భవిష్యత్తును కూడా ఆలోచించాలని చురకలాంటించాడు.