Advertisement
ఎవరు ఎప్పుడు పుడతారు ఎవరు ఎప్పుడు చనిపోతారు అనేది ఎవరు ఊహించలేము. పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈ లోకాన్ని విడిచి కచ్చితంగా వెళ్లిపోవాలి. మనిషి ఎంతో అభివృద్ధిని సాధించాడు. ఉన్నత శిఖరాలని అవరోదించాడు. ఈ భూమి మీద సర్వస్వాన్ని జయించిన మనిషి కేవలం చావుకి మాత్రమే తలవంచుతూ ఉంటాడు. అలాంటి చావు మనుషులకి ముందు గానే తెలుస్తుంది హిందూ పురాణాలు ప్రకారం చనిపోయిన ఐదు నిమిషాల ముందు చావు వాళ్ళ కంటికి కనబడుతుందట. ఆ చివరి క్షణంలో ఏం ఆలోచిస్తారు, దేని గురించి మాట్లాడుతారు అనే దాని మీద పలు అధ్యయనాలు జరిగాయి ఈ క్రమం లో అమెరికాకు చెందిన సైంటిస్టులు కొన్ని ఆసక్తికరమైన విషయాలని వెల్లడించారు. నివేదిక ఆధారంగా అసలు చనిపోయే ముందు వ్యక్తులు దేని గురించి ఆలోచిస్తారు అనే విషయాలు తెలుస్తున్నాయి.
Advertisement
Advertisement
చాలామంది పిల్లల ప్రేమకి దూరంగా ఉంటారు అలాంటి వారు చనిపోయే ముందు చివరి క్షణాన పిల్లలు చూడాలని వాళ్లతో మాట్లాడాలని ఏడుస్తారు. కొందరు అప్పటివరకు జీవితంలో జరిగిన సంఘటనలు గుర్తు తెచ్చుకొని వారు చేసిన తప్పులని తెలుసుకుని పశ్చాతాపంతో కుమిలిపోతుంటారు. కొంతమంది ఇష్టమైన వ్యక్తులు వాళ్ళ పేర్లని పదేపదే గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు.
కొంతమంది మాత్రం తమ జీవితంలో గడిపిన తీపి జ్ఞాపకాలని మాత్రమే గుర్తు తెచ్చుకుంటారట. పిల్లలతో సరదాగా గడిపిన క్షణాల్ని స్నేహితులతో సరదాగా గడిపిన క్షణాలను గుర్తు తెచ్చుకొని సంతోషంగా చనిపోతారని స్టడీలో తెలుస్తోంది. కొంతమంది చనిపోయే ముందు ఎదురుగా ఎన్ని వందలు మంది ఉన్నా కూడా ఇష్టమైన దైవాన్ని తెలుసుకొని కన్నుమూస్తారని తెలుస్తోంది. ముఖ్యంగా ఆధ్యాత్మికతకి చెందిన మనుషులు అయి ఉంటారు ఇంకొంత మంది అయితే సిల్లీగా తమకు ఇష్టమైన ఆహార పదార్థాలను తినాలని ఆశ పడుతూ ఉంటారు ఇలా చనిపోయే ముందు ఈ విధంగా మనుషులు ఆలోచిస్తారని తెలుస్తోంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!