Advertisement
రామ నామానికి మించిన స్మరణ లేదంటూ ఉంటారు పెద్దలు. అలాంటి రాముని భక్తుడైన హనుమంతుడు చాలా గొప్ప దేవుడు. ఒక ఏడాదిలో హనుమాన్ జయంతి మూడుసార్లు జరుపుతారు. చైత్ర పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని జరిపితే, మరికొందరు వైశాఖమాసం దశమి రోజున, తమిళనాడు కేరళ రాష్ట్రాలలో మార్గశిర మాసంలో హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 6, 2023 గురువారం హనుమాన్ జయంతి వచ్చింది. ఈ రోజున వాయు పుత్రుడు హనుమంతుడిని పూజించడం వల్ల భక్తులు కష్టాలు తీరిపోవడమే కాకుండా, పనులు కూడా త్వరగా పూర్తవుతాయి.
Advertisement
also read: మరో కుటుంబాన్ని ఆదుకున్న కోమటిరెడ్డి
also read:కవిత.. ఏదో అనుకుంటే.. ఏదో జరిగింది..!
Advertisement
ఈరోజు ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల జీవితంలో వచ్చే కష్టాలని తొలగిపోయి, సుఖ సంతోషాలు కలుగుతాయి. ఈరోజు పూజ చేయడమే కాకుండా కొన్ని ప్రత్యేక చర్యలు చేయడం ద్వారా హనుమంతుని అనుగ్రహం ఉంటుంది.ముఖ్యంగా హనుమాన్ జయంతి రోజున హనుమాన్ చాలీసా చదవడం మంచిది. అంతేకాకుండా హనుమాన్ అష్టకం,సుందరకాండ,హనుమాన్ చాలీసా పటించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
దీనివల్ల ఇంట్లో ఆనందం,శాంతి కూడా నెలకొంటుంది. ఆంజనేయుడికి సింధూరం ఇష్టమని అంటారు. హనుమాన్ జయంతి రోజున సింధూరం రంగు దుస్తులను ధరించి హనుమంతుడికి మన కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. హనుమంతుని ఆలయానికి వెళ్లి ఆయనను దర్శించుకుని అక్కడ నెయ్యి లేదా నూనె దీపం వెలిగించండి. అంతేకాకుండా హనుమాన్ చాలీసా 11 నుంచి 23 సార్లు చదివితే మీకు అష్టైశ్వర్యాలు కలగడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటారని పండితులు అంటున్నారు..
also raed: కొడుకు పెద్ద స్టార్.. తల్లి చిన్న ఇంట్లో నివాసం.. జగపతిబాబు తల్లి సింప్లిసిటీకి హ్యట్సాఫ్..!!