Advertisement
తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారేమో అని గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. కేంద్రం కూడా ఈ అంశంపై దృష్టి పెట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంపై అత్యంత రహస్యంగా విచారణ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ పై ప్రస్తుతం కోర్టుల్లో పిటిషన్లు ఉన్నాయి. విచారణకు అనుమతి ఇస్తే.. అధికారిక విచారణ అవుతుంది. లేకపోతే.. కేంద్రం తమ నిఘా వర్గాల ద్వారా అసలు విషయం తెలుసుకునే అవకాశం ఉంది. గవర్నర్ వ్యాఖ్యల నేపథ్యంలో పలువురు నేతలు స్పందించారు. ఎవరెవరు ఏమన్నారో చూద్దాం.
Advertisement
ఈటల రాజేందర్, బీజేపీ ఎమ్మెల్యే
సొంత పార్టీ మంత్రులు, వారి కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారు. స్వేచ్ఛను హరించి బానిసల్లాగా మారుస్తున్నారు. గవర్నర్ ఫోన్ ని ట్యాపింగ్ చేస్తున్నారని ఆమె చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటే ఇంతకంటే దుర్మార్గం ఏం లేదు. కేసీఆర్ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మెదడు పెట్టి పని చేయకుండా చేశారు ముఖ్యమంత్రి.
Advertisement
కూనంనేని సాంబశివరావు, సీపీఐ రాష్ట్ర అధ్యక్షుడు
గవర్నర్ ఫోన్ ట్యాపింగ్ జరిగితే కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉంది కదా. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. గవర్నర్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. ఢిల్లీ ఆదేశాల మేరకు గవర్నర్ పనిచేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పడం వెనుక అంతర్యం ఏంటి? గవర్నర్ ఇలాంటి మాటలు మాట్లాడటం సరికాదు. రాజకీయాలు చేయాలనుకుంటే బీజేపీ కండువాతో తమిళనాడులో చేసుకోవాలి.
ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బీజేపీ నేత
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఛైర్మన్ లు, ఉన్నాతాధికారులు ఫోన్ ట్యాపింగ్ అని అంటున్నారు. చివరకి గవర్నర్ కూడా అదే చెప్పారు. ప్రతిపక్ష నాయకుల ఫోన్లు కూడా ట్యాపింగ్ అవుతున్నాయి. ఈ వ్యవహారమంతా సీఎంఓ నుంచే జరుగుతోంది. ఫాంహౌజ్ ఫైల్స్ కంటే అతి పెద్ద తీవ్రమైన వ్యవహారంగా భావించాలని తెలంగాణ మేధావులను కోరుతున్నా. ఈ వ్యవహారంపై ఉన్నతస్థాయి విచారణ జరపాలి.