Advertisement
బాల రామాయణం.. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ బాల నటునిగా వెండితెరకు పరిచయమైంది ఈ సినిమా ద్వారానే. 1996 ఏప్రిల్ 14న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ పాతికేళ్లు పూర్తి చేసుకుంది. నిర్మాత ఎమ్మెస్ రెడ్డి చిన్నపిల్లలకు సైతం అర్థం కావాలనే ఉద్దేశంతో బాల రామాయణం సినిమాని తీశారు. ఈ చిత్రానికి దర్శకునిగా పనిచేసింది గుణశేఖర్. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత మళ్లీ ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ రామాయణాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఎన్టీఆర్ 13 సంవత్సరాల వయసులోనే రామాయణం సినిమాతో ప్రేక్షకులను మెప్పించారు. పూర్తిగా పిల్లలతోనే తెరకెక్కిన ఈ రామాయణం సినిమా బాల రామాయణంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. అలా పాతికేళ్ల తర్వాత ఈ చిత్రంలో నటించిన బాల నటులు ఎవరెవరు? వారు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసుకుందాం.
Advertisement
Read also: ఛత్రపతి సూరీడు ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా..?
1) జూనియర్ ఎన్టీఆర్.
ఈ చిత్రంలో రాముడి పాత్రలో బాలనటునిగా పరిచయమైన ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఈ చిత్రం తర్వాత హీరోగా పరిచయమై ఇప్పటివరకు 29 సినిమాలలో నటించారు.
2) స్మిత మాధవ్.
Advertisement
ఈ చిత్రంలో సీత పాత్రలో నటించిన స్మిత మాధవ్ ప్రస్తుతం భరతనాట్యకారిణిగా సెటిల్ అయ్యారు.
3) నారాయణం నిఖిల్.
ఈ చిత్రంలో లక్ష్మణుడి పాత్రలో నటించారు నారాయణ0 నిఖిల్.
4) అర్జున్ గంగాధర్.
ఈ చిత్రంలో హనుమంతుడి పాత్రలో నటించారు అర్జున్ గంగాధర్.
5) స్వాతి బాలినేని.
ఈ చిత్రంలో రావణుడి పాత్రలో నటించింది స్వాతి బాలినేని.
6) సునైనా.
ఈ చిత్రంలో శబరి పాత్రలో నటించి అందరినీ మెప్పించింది సునైనా.
7) అమ్జధ్ ఖాన్.
ఈ చిత్రంలో కుంభకర్ణుడి పాత్రలో నటించారు అమ్జధ్ ఖాన్.
8) శ్వేత.
ఈ చిత్రంలో రావణుడి భార్య మండోదరి పాత్రలో నటించింది శ్వేత.
ఇలా వీరు మాత్రమే కాక మిగిలిన అన్ని పాత్రల్లో ఉన్న పిల్లలు కూడా చాలా చక్కగా నటించి అందరినీ మెప్పించారు.
Read also: పర్ఫ్యూమ్ కి, డియోడ్రంట్ కి మధ్య తేడా ఏంటో తెలుసా?