Advertisement
Pindam Movie Review and Rating పిండం సినిమా రివ్యూ: తెలుగు సినిమా లో కొత్త ట్రెండ్ మొదలయ్యింది అనే చెప్పాలి, ఈ మధ్య కాలం లో హారర్ జోనర్ లో చాలానే వస్తున్నాయ్. మాసూదా, విరూపాక్ష, పొలిమేర 2 , మంగళవారం వంటి సినిమాలు హిట్ టాక్ తెచ్చుకుని మంచి సక్సెస్ సాధించాయి. ఈ జోనర్ లోనే వస్తున్న సినిమా ‘పిండం’ సినిమా టైటిల్ ప్రకటించినప్పటి నుంచి ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ట్రైలర్, టీజర్ లు ఎంతో ఆకర్షించాయి. పిండం సాయికిరణ్ దైదా దర్శకత్వం వహించిన తెలుగు హారర్ థ్రిల్లర్ చిత్రం కాగా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 15 న విడుదల కాబోతుంది.
Advertisement
పిండం తారాగణం Pindam Cast
- శ్రీకాంత్ శ్రీరామ్,
- కుషీ రవి, మరియు
- శ్రీనివాస్ అవసరాల
- ఈశ్వరీ రావు,
- రవివర్మ,
- మాణిక్ రెడ్డి,
- బేబీ చైత్ర,
- బేబీ లీషా,
- విజయలక్ష్మి,
- శ్రీలత
కృష్ణ సౌరభ్ సూరంపల్లి సంగీతం అందించిన ఈ చిత్రానికి సతీష్ మనోహరన్ సినిమాటోగ్రఫీ అందించగా, శిరీష్ ప్రసాద్ ఎడిటింగ్ చేశారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Pindam Story పిండం సినిమా కథ
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ఆంథోనీ (హీరో శ్రీరామ్) ఒక రైస్ మిల్లులో ఉద్యోగం చేస్తూ ఉంటారు, ఆయన భార్య (ఖుషి రవి) తన ఇద్దరి కూతుళ్లు అమ్మ సూరమ్మలతో కలిసి ఒక పల్లెలంటూరిలోని పాడుబడ్డ ఇంటిని కొనుగోలు చేస్తారు అక్కడ చేరిన తరువాత భార్య హాస్పిటల్ కి చేరడం, తల్లి కూడా ప్రమాదానికి గురి అవ్వడంతో కథ ఊహించని మలుపులు తీసుకుంటుంది.
Advertisement
అసలు శ్రీరామ్ (ఆంటోనీ) ఆ ఇంటిని ఎందుకు కొనాలని అనుకున్నారు, అక్కడ ఎదురయ్యింది సమస్యలు ఏమిటి ? తనకి వచ్చిన సమస్యల మీద క్షుద్ర శక్తులని అరికట్టడానికి అన్నమ్మ (ఈశ్వరి రావు) ఎలా సమస్యలని తీర్చింది ? అన్నమ్మ స్నేహితుడు (శ్రీనివాస్) కలిసి తన కుటుంబాన్ని ఎలా కాపాడారు ? ఆ పాడుబడ్డ పాత ఇంట్లోకి ఆ ఆత్మ ఎలా వచ్చింది ? ఆ ఇంట్లో తన చిన్న కూతురికి ఆవహించిన ఆత్మ విడిచిందా ? లేదా ? ఇలా సాగుతుంది ‘పిండం’ కథ’.
ఎవరి నటన ఎలా ఉందంటే ?
ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో గ్లామరస్ పాత్రలకే పరిమితమైన శ్రీరామ్ ఈ సినిమాలో తన అప్పియరెన్స్ డిఫరెంట్ గా ఉంటుంది. సరికొత్త లుక్ లో ఈ సినిమాలో మనకు కనిపిస్తారు, సెంటిమెంట్ సన్నివేశాల్లో బాగా నటించారు. భార్య పాత్రలో ఖుషి రవి మంచి మార్కులే కొట్టేసింది అని చెప్పాలి. మరో మెయిన్ క్యారెక్టర్ ఈశ్వరి రావు మంత్రగత్తెగా సినిమాని ఇంట్రెస్టింగ్ గా నడపడం లో తన వంతు పాత్రని పోషించారు. మరో నటుడు అవసరాల శ్రీనివాస్ కూడా గుర్తుండిపోయే క్యారెక్టర్ చేసారు. శ్రీరామ్ కూతుర్లు గా నటించిన ఇద్దరి చైల్డ్ ఆర్టిస్టుల నటన ఆకట్టుకుంటుంది.
సినిమా ఎలా ఉందంటే ?
దర్శకుడి మొదటి చిత్రం అయినా కూడా అస్సలు ఎక్కడ ఆలాగే అనిపించదు ఎందుకంటే ప్రతి సన్నివేశాన్ని ఆలా తీర్చి దిద్దారు. సినిమాని ఎక్కడ బోర్ కొట్టనివ్వకుండా స్క్రీన్ ప్లే ని నడిపించారని చెప్పాలి. ఇక్కడ దర్శకుడు సక్సెస్ సాధించాడు. ప్రతి సినిమాలో చూపించే రొటీన్ కథలాగే అనిపించినా సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ లో సెంటిమెంట్ సన్నివేశాలు కచ్చితంగా ఆకట్టుకుంటాయి.
సినిమా కథ పాతదే అయినప్పటికీ దర్శకుడి ప్రతిభ తెరపైన కనిపిస్తుంది ఎక్కడ బోర్ కొట్టనివ్వకుండా ప్రతి సన్నివేశాన్ని ప్రేక్షుడికి నచ్చేలా తీర్చిదిద్దడం లో విజయవంతం అయ్యారు. హారర్, థ్రిల్లర్ సినిమాలు చూసే వారికి ఈ సినిమా తప్పక నచ్చుతుంది. ఈ సినిమా పక్కగా థియేటర్ లోనే చేసెయ్యాలి. థియేటర్ లో చుసిన ఫీల్ OTT లో రాకపోవచ్చు. ఫామిలీ ఎమోషన్స్, చైల్డ్ సెంటిమెంట్ తప్పకుండ ఆకట్టుకుంటాయి.
Rating
3/5
తెలుగు సినిమా రివ్యూ ల కోసం ఇక్కడ చుడండి, తెలుగు న్యూస్ కోసం ఇవి చదవండీ !