Advertisement
ప్రధాని మోడీ చాలా రోజుల తర్వాత తెలంగాణ పర్యటనకు వచ్చారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పరేడ్ గ్రౌండ్స్ లో సభ నిర్వహించగా.. ముందుగా ఊహించినట్టే కేసీఆర్ సర్కార్ పై సెటైరికల్ కామెంట్స్ చేశారు. ముందుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న మోడీకి గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ స్వాగతం పలికారు. బీజేపీ నేతలు కూడా ప్రధానికి గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు.
Advertisement
ఎయిర్ పోర్టు నుంచి నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లారు మోడీ. అక్కడ సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ పాల్గొన్నారు. అయితే.. పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన సభలో పాల్గొనలేదు. బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. పరోక్షంగా ఎమ్మెల్సీ కవిత ఈడీ కేసును ప్రస్తావించారు. చేసిన అవినీతి నుంచి తమను కాపాడాలంటా కొందరు చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించిందన్నారు.
Advertisement
కుటుంబ, అవినీతి పాలన తెలంగాణకు ఆటంకంగా మారిందని విమర్శించారు మోడీ. అవినీతి, కుటుంబ పాలనను తరిమికొట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. కేంద్ర ప్రాజక్టులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకరించటం లేదని.. కేంద్ర పథకాలను తెలంగాణలో ఎందుకు అమలు చేయటం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో టెక్స్ టైల్స్ పార్క్ ను ఏర్పాటు చేస్తున్నామని, నూతన ప్రాజక్టుల ఏర్పాటుతో యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని తెలిపారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని చెప్పారు.
కుటుంబ పాలన అంటూ మోడీ వ్యాఖ్యలను ముందే గ్రహించిన బీఆర్ఎస్ సానుభూతిపరులు హైదరాబాద్ లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. బీజేపీలోని కీలక నేతలు, పక్కనే వారి వారసుల ఫోటోలు ముద్రించి.. “మోడీకి పరివార స్వాగతం” అంటూ సెటైరికల్ గా ముద్రించారు. ఈ ఫ్లెక్సీల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.