Advertisement
ప్రధాని మోడీ ఏదైనా రాష్ట్రానికి వెళ్తే.. అక్కడి ట్రెడీషనల్ కి తగ్గట్టు డ్రెస్ వేసుకుంటారు. నేను కూడా మీలో ఒకడినే అనేలా స్థానికుల్లో కలిగేలా చేస్తుంటారు. ప్రతిపక్షాలు దీనిపై వ్యంగ్యాస్త్రాలు సంధించినా.. మోడీకి ఇంకాస్త ఇమేజ్.. బీజేపీకి మరికొంత మైలేజ్ పెరగడం ఖాయం. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు ప్రధాని. అయితే.. ఈసారి ఉత్తరాఖండ్ పర్యటనలో హిమాచల్ ప్రదేశ్ డ్రెస్ వేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.
Advertisement
ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ కేదార్ నాథ్ దేవాలయాన్ని ప్రధాని మోడీ సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కేదారీశ్వరుడ్ని దర్శించుకున్నారు. జగద్గురు ఆదిశంకారాచార్య సమాధిని కూడా సందర్శించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఉత్తరాఖండ్ వెళ్లారు మోడీ.రూ.3400 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.
Advertisement
కేదార్ నాథ్ లో మోడీ వేసుకున్న డ్రెస్ పై సర్వత్రా చర్చ సాగుతోంది. పవిత్ర పుణ్యక్షేత్రంలో మోడీ సంప్రదాయ పహాడీ దుస్తుల్లో కనిపించారు. హిమాచల్ ప్రదేశ్ లోని చంబా మహిళలు తయారు చేసిన దుస్తులను ఆయన ధరించారు. ప్రధాని వెంట ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కూడా ఉన్నారు. ఉత్తరాఖండ్ పర్యటనలో హిమాచల్ ప్రదేశ్ మహిళలు తయారు చేసిన డ్రెస్ వేసుకోవడం ఏంటనే డౌట్ రావొచ్చు. దీని వెనుక పెద్ద ప్లానే ఉందని రాజకీయ వశ్లేషకుల వాదన.
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఇరుగుపొరుగు రాష్ట్రాలే. కానీ, నవంబర్ 12న అక్కడ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. మొత్తం 68 అసెంబ్లీ స్థానాలున్న ఈ రాష్ట్రంలో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం అక్కడ బీజేపీ పాలన సాగుతోంది. మరోమారు గెలవాలని ప్రయత్నాల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే పొరుగు రాష్ట్రం ఉత్తరాఖండ్ పర్యటనలో ప్రధాని మోడీ హిమాచల్ ప్రదేశ్ కు చెందిన మహిళలు తయారు చేసిన దుస్తులు ధరించారని చెబుతున్నారు.