Advertisement
Ponniyin Selvan PS-2 Review in Telugu: ఇండియాలో సెన్సేషనల్ డైరెక్టర్ మణిరత్నం చాలా ఏళ్ల పాటు ప్రయత్నించి తెరకెక్కించిన చిత్రం పొన్నియన్ సెల్వన్. ఈ సినిమా కథ తమిళులు దశాబ్దాల నుంచి చాలా గొప్పగా చెప్పుకుంటూ వస్తున్న నవల. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. మొత్తం ఐదు భాగాలు ఉన్న ఈ నవలను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్న సంగతి తెలిసిందే. మొదటి భాగం “పీఎస్ – 1” పేరుతో గత ఏడాది విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ఇతర భాషలలో పెద్దగా ప్రభావం చూపకున్నా తమిళనాడులో రికార్డు వసూళ్లను సాధించింది.
Advertisement
Read also: సాయి ధరమ్ తేజ్ “విరూపాక్ష” రివ్యూ & రేటింగ్
భారీ తారాగణంతో ప్రేక్షకులను థియేటర్ కి రప్పించేలా చేయడంలో మణిరత్నం సఫలమయ్యారు. కార్తీ, విక్రమ్, త్రిష, ఐశ్వర్యారాయ్ వంటి స్టార్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఓసారి చూడాలి అనుకునే జనాలు కూడా ఉండడంతో ఈ సినిమా మంచి సక్సెస్ ని అందుకుంది. ఇక ఈ సినిమా కథను మొత్తం సెకండ్ పార్ట్ కోసం దాచడంతో సినిమా మీద విపరీతమైన ఆసక్తి నెలకొంది. వేసవి కానుకగా పొన్నియన్ సెల్వన్ 2 చిత్రం ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. అరుల్మోజీ ( జయం రవి), వల్లవరాయన్ (కార్తి) సముద్రంలో జరిగిన యుద్ధంలో మరణించినట్లు మొదటి భాగాన్ని ముగించారు. ఇప్పుడు రెండవ భాగం అక్కడి నుండే మొదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
Ponniyin Selvan PS-2 Story in Telugu: కథ మరియు వివరణ:
Advertisement
పొన్నియన్ సెల్వన్ – 2 కథ మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో కథ ప్రారంభం అవుతుంది. బౌద్ధులు వల్లవరాయన్ వీర పాండ్యన్ హత్యకు కారణమైన ఆదిత్య పై ప్రతీకారం తీర్చుకోవడానికి.. అలాగే అరుణ్ మౌళి, నందిని, పాండియన్ సమూహాలను రక్షించడం కోసం మధురాంతకన్, అతని శివ భక్త అనుచరులు చోళ సింహాసనన్ని లక్ష్యంగా చేసుకోవడంతో వారి కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ఆదిత్య కరికాలన్, నందిని ఏమయ్యారు..? చోళ రాజ్యంలో మధురాంతకన్ సింహాసనాన్ని పొందుతాడా..? అనేవి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Read also: నేటి తరానికి అస్సలు పరిచయం లేని ఈ తెలుగు సినీ స్టార్స్ గురించి తెలుసా ?
ఈ చిత్రంలో నటించిన భారీ తారాగణం అంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. ఈ మూవీలో ఐశ్వర్యారాయ్ – విక్రమ్ సీన్స్ హైలెట్. అలాగే నందిని, మందాకిని రెండు పాత్రలలో కనిపించిన ఐశ్వర్యారాయ్ తన నటనతో అదరగొట్టిందని చెప్పుకోవాలి. నందిని, కరికాలన్ కలుసుకునే సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. ఇక వందియదేవన్ పాత్రలో కార్తీ ఎంటర్టైన్మెంట్ పార్ట్ 2 లో కూడా కొనసాగింది. ఇంటర్వెల్ సీన్ సినిమాకి హైలైట్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా చోళుల రాజ్యంలో జరిగే కుట్రలు, వాటికి ఆదిత్యుడు, కుందవి, అరుణ్ మోళి వర్మన్ చెప్పే సమాధానాలతో కధ అధ్యంతం ఆకట్టుకునే విధంగా ఉంది. అయితే అక్కడక్కడ కధ చాలా స్లోగా అనిపిస్తుంది. ఏఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. కానీ ఈ చిత్రం ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది.
Ponniyin Selvan PS-2 Review ప్లస్ పాయింట్స్:
- కథ
- నటీనటుల నటన
- సినిమాటోగ్రఫీ
- ఇంటర్వెల్ సీన్
మైనస్ పాయింట్స్:
సాగదీత సన్నివేశాలు
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
క్లైమాక్స్
Ponniyan Selvan PS-2 Review in Teluguరేటింగ్: 2.75/5
Read also: విడుదల” సినిమా పార్ట్ -1 రివ్యూ & రేటింగ్