Advertisement
సాధారణంగా ఏ ఇండస్ట్రీలో అయినా కొన్ని కథలను ఒక హీరోతో చేద్దామని అనుకొని తర్వాత మరొకరితో చేయాల్సి వస్తుంది. దీనికి కారణం ఆ హీరోకు డేట్స్ సర్దుబాటు కాక లేదా ఇతర కారణాల వలన సినిమాలు చేంజ్ అవుతూ ఉంటాయి. అయితే తాజాగా పొన్నియన్ సెల్వన్ మూవీ కూడా విడుదలైంది. ఈ సినిమాకు కూడా ఇలాంటి కథే ఉంది. ఈ మూవీని లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించారు.
Advertisement
also read: విజయనిర్మలకు నరేష్ కాకుండా మరో అబ్బాయి కూడా ఉన్నారా..?
ఇప్పటికి ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలు తీసిన మణిరత్నం మొదటిసారి భారీ విజువల్ ఎఫెక్ట్ తో ఈ మూవీ చేశారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే చోళుల కథ ఆధారంగా తెరకెక్కించారు. ఈ కథ కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా రెండు పార్టులుగా తీశారు. సెప్టెంబర్ 30 న విడుదలైన ఈ మూవీలో విక్రమ్, కార్తీ ప్రధాన పాత్రలో నటించారు. అంతేకాకుండా జయం రవి సైతం ఈ సినిమాలో ముఖ్య పాత్ర చేశారు. హీరోయిన్ గా త్రిష మరియు ఐశ్వర్య రాయ్ నటించారు. అసలు విషయానికి వస్తే ఈ సినిమాను ముందుగా విక్రమ్, కార్తీ చేసిన పాత్రలో ఇద్దరు స్టార్ హీరోలను అనుకున్నారట. అందులో మన తెలుగు హీరో కూడా ఉన్నారు.
Advertisement
ఈ విషయాన్ని ఈ సినిమాకు రచయితగా చేసిన జగన్మోహన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇందులో మొదటగా కార్తీ చేసిన పాత్రకు స్టార్ హీరో మహేష్‌బాబు అనుకున్నారట. కానీ మహేష్ బాబు ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల దాన్ని రిజెక్ట్ చేశారట. అంతే కాకుండా విక్రం చేసిన పాత్ర కోసం తమిళ స్టార్ హీరో విజయ్ ని అనుకున్నారట. కానీ విజయ్ కూడా డేట్స్ కుదరకపోవడంతో సినిమాలు రిజెక్ట్ చేశారని చెప్పారు. దీంతో ఈ అవకాశం విక్రమ్, కార్తీలను వరించింది.
also read:మెగాస్టార్ చిరుకి 30 ఏళ్లుగా డూప్ గా చేస్తున్న వ్యక్తి ఎవరంటే..!!