Advertisement
టాలీవుడ్ ఒకప్పటి హీరోయిన్ పూనమ్ కౌర్. సోషల్ మీడియాలో వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తోంది పూనమ్ కౌర్. పూనమ్ కౌర్ ఎలాంటి విషయం గురించైనా తన అభిప్రాయాలు చెబుతోంది. కానీ పరోక్షంగా మాత్రమే. అప్పట్లో పూనమ్ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ ఇన్ డైరెక్ట్ గా చేసిన ట్వీట్స్ హాట్ టాపిక్ గా నిలిచాయి. తన కామెంట్స్ తో పూనమ్ కౌర్ రూమర్స్ కి కేంద్ర బిందువుగా మారింది.
Advertisement
చాలా విషయాల్లో ఆమె క్లారిటీ మెయింటైన్ చేయకుండా అందరిని తికమక పెట్టేది. దీనితో పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టిన అభిమానుల్లో చర్చ జరిగేది. ఆమె గురించి న్యూస్ వైరల్ అవుతూ వచ్చింది. ఇది ఇలా ఉండగా, హీరోయిన్ పూనమ్ కౌర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఫైబ్రో మయాలిజియా అనే అరుదైన సమస్యతో బాధపడుతున్న ఆమె ప్రస్తుతం కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటుందట.
Advertisement
ఈ వ్యాధి కారణంగా అలసట, నిద్ర, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, మానసిక స్థితిలో సమస్యలు, కండరాల నొప్పి సహా పలు ఇబ్బందులు పడుతుందని సమాచారం. సినిమాల కన్నా సోషల్ మీడియాలో ఎక్కువ పాపులర్ అయిన పూనమ్ రెండేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతోందని, ఈ సమస్య నుంచి బయటకు రావడానికి కేరళలో ట్రీట్మెంట్ తీసుకుంటుందట. దీనికి సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇక ఆటు ఇది మందు కాదు, ప్రేమతో ఇస్తున్నారు. దీని వల్లే నా రోగం కూడా తగ్గుతుంది అంటూ పూనమ్ కౌర్ తన ఇన్స్టా స్టోరీలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.
ఈ వ్యాధి లక్షణాలు
నిద్రలేమితనం
మతిమరుపు
జ్ఞాపకశక్తి తగ్గిపోవడం
అలసట
మానసిక స్థితి సరిగ్గా ఉండకపోవడం
కండరాల సమస్యలు
READ ALSO : Ginna Movie : ఓటీటీలోకి జిన్నా, స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?