Advertisement
టాలీవుడ్ లో ‘మాయాజాలం’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి, అటు పై కొన్ని సినిమాలు చేసి తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంది పూనమ్ కౌర్. ఆ తర్వాత అమ్మడు సినిమాల్లో ఫెడవుట్ అవ్వడంతో ప్రస్తుతం క్యారెక్టర్ పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తోంది. ఇక పూనమ్ కౌర్ సోషల్ మీడియా వేదికగా ఏది పోస్ట్ చేసినా అది కచ్చితంగా మారుతుంది. సినీ, రాజకీయ వ్యవహారాలపై పూనమ్ కౌర్ తనదైన కౌంటర్స్ వేస్తూ వస్తోంది.
Advertisement
ఇది ఇలా ఉండగా కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతోంది. 4వ రోజు రాష్ట్రంలో రాహుల్ పాదయాత్ర సాగుతోంది. ఈ పాదయాత్రలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొని రాహుల్ వెంట నడుస్తున్నారు. పాదయాత్ర మధ్యలో ప్రజలతో రాహుల్ మాట్లాడి సమస్యలు తెలుసుకునేలా టీపీసీసీ ప్లాన్ చేస్తోంది. కార్నర్ మీటింగ్స్ ద్వారా పార్టీ క్యాడర్ కూడా రాహుల్ ను కలుసుకునే అవకాశం కల్పిస్తోంది. శనివారం రాహుల్ పాదయాత్రలో సినీ హీరోయిన్ పూనమ్ కౌర్ ఒక్కసారిగా మెరిసింది. పాదయాత్రలో పాల్గొన్న ఈ బ్యూటీ, రాహుల్ తో కాసేపు ముచ్చటించింది.
Advertisement
రాహుల్ ను కలిసిన అనంతరం పూనమ్ కౌర్ మీడియాతో మాట్లాడుతూ, చేనేత కార్మికుల సమస్యలపై రాహుల్ తో చర్చించానని, రాహుల్ సమస్యలను బాగా అధ్యయనం చేస్తున్నారని తెలిపింది. చేనేతల సమస్యలపై పార్లమెంటులో మాట్లాడాలని రాహుల్ ను కోరానని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు పూనమ్ కౌర్ చెప్పుకొచ్చింది. చేనేత ఉత్పత్తులపై ఐదు శాతం జీఎస్టీ విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, గ్యాస్ ధరలపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని రాహుల్ ను పూనమ్ కోరారు.
Read also : పైలట్ రోహిత్ రెడ్డి సెక్యూరిటీ పై కెసిఆర్ సంచలన నిర్ణయం !