Advertisement
Pothuluri Veerabrahmendra Swamy: పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈయన మహా జ్ఞాని. కాలజ్ఞానం రచించారు. ఆయనకు చాలా పేరు కూడా వచ్చింది. ఆయన పేరు మీద సినిమా కూడా తీసి ఆయన చెప్పిన విషయాలన్నిటిని సినిమాలో పెట్టారు. ఈశాన్య దేశంలో పుట్టే కోరంగి అని జబ్బు వలన కోట్ల మంది చనిపోతారని బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే కరోనా వచ్చి చాలామంది చనిపోయారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఇంకా ఎటువంటి ఉత్పాతాలు సంభవిస్తాయో తెలుసుకుందాం. ప్రపంచంలో పాపుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. పుణ్యం చేసిన వాళ్ళు చనిపోతారు. శ్రీశైల పర్వతానికి ముసలి వస్తుంది. అలానే పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గారు ఆ ముసలి భ్రమరాంబ ఆలయంలో ఎనిమిది రోజులు ఉండి మేకలా కూసి తర్వాత మాయమైపోతుందని అన్నారు.
Advertisement
శ్రీశైలంలో అగ్ని వర్షం పడుతుందని అన్నారు. గుగ్గిళ్ళ బసవన్న రంకెలు వేస్తాడని అన్నారు. కృష్ణ గోదావరి మధ్య పశువులు మరణిస్తాయి. పిడుగులు పడి నదులు ఇంకిపోతాయని చెప్పారు. విచిత్ర వ్యాధులు పుట్టి ప్రజలు కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్లుగా నిలబడిన వాళ్ళు నిలబడినట్లుగా చనిపోతారని అన్నారు. రాత్రి పగలు గద్దలు గుంపులు గుంపులుగా అరుస్తాయని అన్నారు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. నీటిలోని చేపలు తాము చూస్తామని పలుకుతూ వెలుపలికి వస్తాయని అన్నారు సూర్య మండలం నుండి మాటల రూపంలో శబ్దం వినిపిస్తుందని, విషవాయువు కొట్టినప్పుడు శివుని కంట నీరు కారుతుందని అన్నారు. విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతూ పగలు లేచి నిలబడుతుందని చెప్పారు.
Advertisement
Also read:
- Vastu Tips: వంటగదిలో ఈ మార్పులు చేసారంటే.. ఎప్పుడు లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది..!
- Salim Baig : ఘర్షణ సినిమాలో నటించిన ఈ నటుడు.. ఇప్పుడు ఎలా ఉన్నాడో చూస్తే షాక్ అయ్యిపోతారు..!
- Shriya Sharma: జై చిరంజీవ లో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉందో తెలుసా ? తాను ఏ లెవెల్లో ఉందొ చూస్తే హ్యాట్సాఫ్ అంటారు
గ్రామాలు పట్టణాలలో రక్త వర్షం కురుస్తుందని కూడా చెప్పారు. హరిద్వార్ లోని మర్రిచెట్టు పై మహిమలు పుడతాయని అన్నారు. అక్కడ దేవాలయాలు తలుపులు మూసుకుంటాయని కూడా చెప్పారు. ఉక్కు స్తంభానికి కొమ్మలు పుట్టి జాజిపూలు పూస్తాయి, అరణ్యంలో భూమిలో ధనం ఉంటుందని అన్నారు. పాతాళం లో నీరు ఇంకిపోతుందని భూమిపై మంటలు పుడతాయని అన్నారు. నాలుగు సంవత్సరాలు మధ్య ఉన్న ధనమంతా శ్రీశైలం చేరుతుందని అన్నారు. బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుందని మహాలక్ష్మమ్మ నృత్యం చేస్తూ వచ్చి మాయ కోతుల్ని ఆడిస్తుందని అన్నారు. కృష్ణవేణి ఉప్పొంగి దుర్గమ్మ ముక్కుపుడక తాకుతుందని, కంచి కామాక్షమ్మ కంట కన్నీరు కారుస్తుందని, కుంభకోణంలో ఆలయం గొప్ప కూలిపోతుందని చెప్పారు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!